• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తీన్మార్ మల్లన్నపై సంచలన ఆరోపణలు-మాజీ ముఖ్యమంత్రితో డీల్-ఇప్పటివరకూ రూ.200 కోట్లు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ జర్నలిస్ట్,క్యూ న్యూస్ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై అదే న్యూస్ ఛానెల్‌లో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న చిలకా ప్రవీణ్ అనే జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు చేశారు. క్యూ న్యూస్‌ను అడ్డుపెట్టుకుని మల్లన్న ఇప్పటివరకూ రూ.200 కోట్లు వరకు వసూలు చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్,కాంగ్రెస్,ఎంపీలు బండి సంజయ్,ధర్మపురి అరవింద్‌ల నుంచి డబ్బులు తీసుకొచ్చుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే సీతక్కను కూడా మల్లన్న డబ్బులు డిమాండ్ చేశాడని... అయితే మల్లన్న సంగతి తెలిసి ఆమె డబ్బులు ఇవ్వలేదని అన్నారు. భవిష్యత్‌లో మల్లన్న ఆగడాలన్నీ బయటపెడుతామని హెచ్చరించారు.

బహుజన వాదం పేరుతో మల్లన్న మోసం : చిలకా ప్రవీణ్

బహుజన వాదం పేరుతో మల్లన్న మోసం : చిలకా ప్రవీణ్

తీన్మార్ మల్లన్న బహుజనవాదం పేరుతో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలను మోసం చేస్తున్నాడని చిలకా ప్రవీణ్ ఆరోపించారు. ఇదే బహుజనవాదం పేరుతో తనను సంప్రదిస్తే ఏడాది క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయనతో చేరానని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకూ మల్లన్న తనకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదన్నారు. కోవిడ్ సమయంలోనూ రిస్క్ చేసి మరీ మల్లన్న చేసిన 1650కి.మీ పాదయాత్రను తాను కోఆర్డినేట్ చేశానని చెప్పారు. పొద్దున లేస్తే బహుజన వాదం గురించి మాట్లాడే మల్లన్న.. ఆయన టీవీ చానెల్‌లో,పార్టీలో ఒక్క ఎస్సీ,ఎస్టీ,బిడ్డకు కూడా పదవులు ఇవ్వలేదన్నారు.

అక్కడ దందా జరుగుతోంది : చిలకా ప్రవీణ్

అక్కడ దందా జరుగుతోంది : చిలకా ప్రవీణ్

అటు పార్టీలో,ఇటు టీవీ చానెల్‌లో అన్ని కీలక పదవుల్లో మల్లన్న సామాజికవర్గానికి చెందినవారినే పెట్టుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని విమర్శించే మల్లన్న తాను చేస్తున్నదేంటో చెప్పాలన్నారు. తనను పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రకటిస్తానని... వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మభ్య పెట్టాడని ఆరోపించారు. ఆయన నిర్వహించే ఛానెల్‌లో మార్నింగ్ సెషన్‌లో ఒక దందా,సాయంత్రం ఒక దందా జరుగుతుందని ఆరోపించారు. గతంలో ఓ మహిళ తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి వస్తే ఆమెను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. దాంతో ఆమె ఆత్మహత్యకు కూడా యత్నించిందన్నారు.

మాజీ ముఖ్యమంత్రితో డీల్ : చిలకా ప్రవీణ్

మాజీ ముఖ్యమంత్రితో డీల్ : చిలకా ప్రవీణ్

తీన్మార్ మల్లన్న ఏ నాయకుడి వద్ద ఎన్ని డబ్బులు తీసుకొచ్చుకున్నాడో మొత్తం చిట్టా తన వద్ద ఉందని ప్రవీణ్ అన్నారు. ఇటీవలే పక్క రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రితోనూ డీల్ కుదుర్చుకున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌ను రోజూ తిడుతాడు కాబట్టి మల్లన్నకు ఆయనతో శత్రుత్వం ఉందని చాలామంది భావిస్తారని... కానీ అక్కడి నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చుకొన్నాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓ పెద్ద మనిషి వద్దకు వెళ్లి... ఇక తాను ఓడిపోతున్నానన్న విషయం అర్థమైందని చెప్పి.. ఆయన నుంచి రూ.20 కోట్లు తెచ్చుకున్నాడని ఆరోపించారు. అంబేడ్కర్ వారసుడిగా,కాన్షీరాం కలలు గన్న రాజ్యం రావాలని మల్లన్నతో తిరిగితే ఆయన చేస్తున్నవి ఇలా ఉన్నాయన్నారు.

Bithiri Sathi Beaten By A Person : వీ6 ఆఫీసు ముందే, నిందితుడు ఏమన్నాడంటే? | Oneindia Telugu
మల్లన్న ఒత్తిడి వల్లే ఈటల రాజీనామా : చిలకా ప్రవీణ్

మల్లన్న ఒత్తిడి వల్లే ఈటల రాజీనామా : చిలకా ప్రవీణ్

ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేలా మల్లన్నే ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే అరెస్ట్ చేయిస్తారంటూ ఈటలను భయపెట్టారని అన్నారు. ఇప్పుడు రాజేందర్ గెలుపు కోసం టెలీకాలర్లతో ఫోన్లు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇందుకోసం భారీగానే డబ్బులు తీసుకున్నాడన్నారు.తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని ప్రవీణ్ స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్ మనుషులం కాదు,టీఆర్ఎస్ మనుషులం కాదు మరో పార్టీ మనుషులం కాదని తెలిపారు. తాను తిరగబడటంతో రూ.5లక్షలు ఫ్రాడ్ చేసినట్లు తనపై నింద మోపేందుకు యత్నించాడని ఆరోపించారు. తనకు ఉన్నది ఒకే ఒక్క ఖాతా అని... ఏడాది కాలంగా అందులో రూ.5లక్షలు కాదు కదా రూ.50వేలు పడినట్లు నిరూపించినా పంజాగుట్ట చౌరస్తాలో ఉరేసుకుని చనిపోతా అన్నారు.

English summary
Chilaka Praveen,bureau chief at Q news media made sensational allegations against Teenmar Mallanna.He alleged that in the name of Bahujan philosophy Mallanna cheating sc,st,minority people and he collecting crores of rupees from political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X