• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జర్నలిస్ట్ కుమారుడి కిడ్నాప్ కేసు .. గుట్టల్లో బాలుడ్ని చంపేసిన కిడ్నాపర్లు

|

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ కుమారుడు కుసుమ దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కథలో పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు . ఆదివారం సాయంత్రం అపహరణకు గురైన కుసుమ దీక్షిత్ రెడ్డి ఎలాంటి హాని లేకుండా కిడ్నాపర్ల చెర నుండి బయట పడ్డాడు అని ప్రచారం జరిగిన కాసేపటికే సీన్ మారిపోయింది . సైబర్ క్రైం టీమ్, పోలీసు బృందాలు బాబును కిడ్నాపర్ల చెర నుండి కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని సమాచారం . నాలుగు రోజుల నుండి కొడుకు కోసం రోదిస్తున్న తల్లిదండ్రుల వద్దకు బాలుడు క్షేమంగా చేరతాడు అని భావిస్తే బాలుడు విగత జీవిగా గుట్టల్లో పడి ఉన్నట్టు సమాచారం .

వీడిన కిడ్నాప్ మిస్టరీ .. బాలుడ్ని హతమార్చిన అగంతకులు

వీడిన కిడ్నాప్ మిస్టరీ .. బాలుడ్ని హతమార్చిన అగంతకులు

మహబూబాబాద్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ మిస్టరీని చేదించటం కోసం రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని ప్రాణాలతో కాపాడలేకపోయారని సమాచారం . మహబూబాబాద్ పట్టణానికి చెందిన కుసుమ దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసిన అగంతకులు 45 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కుసుమ దీక్షిత్ రెడ్డి తండ్రి జర్నలిస్టు కావడంతో, తెలంగాణ డిజిపికి, కేంద్ర హోం శాఖకు జర్నలిస్టులు చేసిన విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల చెరనుంచి దీక్షిత్ రెడ్డిని కాపాడటం కోసం విఫల యత్నం చేశారు .

నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కిడ్నాపర్లు ఫోన్ కాల్స్ మరియు వీడియో కాల్స్ చేస్తూ డబ్బులు చూపించాలని డిమాండ్ చేశారు.

డబ్బులు తీసుకుని కిడ్నాపర్ ను కలవటానికి వెళ్ళిన తండ్రి ... ఫోన్ కాల్ ట్రేస్ చేసిన పోలీసులు

డబ్బులు తీసుకుని కిడ్నాపర్ ను కలవటానికి వెళ్ళిన తండ్రి ... ఫోన్ కాల్ ట్రేస్ చేసిన పోలీసులు

డబ్బులు చూపించిన తల్లిదండ్రులు చివరకు డబ్బు ఇచ్చేందుకు కిడ్నాపర్ చెప్పిన చోటికి వెళ్ళి ఎదురు చూశారు. నిన్న మధ్యాహ్నం నుండి రాత్రి వరకు నిరీక్షించినప్పటికీ డబ్బు తీసుకునేందుకు ఎవరూ రాలేదు.

పోలీసులు మహబూబాబాద్ పట్టణమంతా విస్తృతంగా తనిఖీలు చేపట్టడం, కుసుమ దీక్షిత్ రెడ్డి నివసించే ప్రాంతాల్లో ఇళ్లలోనూ సోదాలు నిర్వహించడంతో కిడ్నాపర్లు అలర్ట్ అయ్యారు. అయితే కిడ్నాపర్ ఇంటర్నెట్ కాల్ చేయడం తో అతని కాల్ ఏ ప్రాంతం నుండి వస్తుంది అన్నది ట్రేస్ అవుట్ చేసినట్టు పోలీసులు ఫైనల్ గా అతన్ని పట్టుకున్నట్టు సమాచారం .

 దీక్షిత్ రెడ్డిని హతమార్చిన కిడ్నాపర్లు

దీక్షిత్ రెడ్డిని హతమార్చిన కిడ్నాపర్లు

పట్టణానికి ఆనుకుని ఉన్న అన్నారం గుట్టల్లో దీక్షిత్ రెడ్డి ని హతమార్చినట్టు తెలుస్తుంది . ప్రస్తుతం కిడ్నాప్ చేసి, హతమార్చిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు కోసం ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారా ? లేదా దీని వెనక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్వయంగా ఈ కేసును పర్యవేక్షించి బాబును కాపాడటం కోసం ప్రయత్నాలు సాగించారు . కానీ చివరకు బాలుడు విగతజీవిగా మారాడు

 కిడ్నాపర్ ఎవరు ? డబ్బు కోసమే చేశారా ఇంకెవరైనా దీని వెనుక వున్నారా

కిడ్నాపర్ ఎవరు ? డబ్బు కోసమే చేశారా ఇంకెవరైనా దీని వెనుక వున్నారా

అయితే దీక్షిత్ రెడ్డి తండ్రి తనకు సన్నిహితంగా ఉండే వారే బాబును కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఐదుగురు అనుమానితుల పేర్లు పోలీసులకు చెప్పిన నేపథ్యంలో ఇంతకీ ఈ కిడ్నాప్ కి పాల్పడింది ఎవరు అన్న ఆసక్తి ఇప్పుడు స్థానికంగా చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు పోలీసులు బాలుడి కిడ్నాప్ కేసుతో పాటు బాలుడ్ని హతమార్చిన నిందితులను మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు అని సమాచారం.

English summary
The kidnapping of journalist's son Kusuma Deekshith Reddy in Mahabubabad district has come to an end. Kusuma Deekshith Reddy, who was abducted on Sunday evening, escaped from the custody of the kidnappers without any harm. Attempts by the cybercrime team and police to rescue the boy from the clutches of the kidnappers have finally paid off. The boy was rescued unharmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X