హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్చలు సఫలం, జూడాల సమ్మె విరమణ.. తాత్కాలికంగానే, ప్రభుత్వానికి డెడ్‌లైన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు జూనియర్‌ డాక్టర్లు గురువారం రాత్రి తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మార్చి 11 లోపు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో వైద్యంను పేద ప్రజలకు చేరవేయాలని అనేక రకాల ప్రణాళికలు రూపొంచినం
దేశంలో కేరళ, తమిళనాడు తరహా మనదగ్గర కూడా అనేక రకాల ఆవిష్కరణలకు తెరలేపి వైద్యం అంటే తెలంగాణ అన్నట్టు ఉన్నామని, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ దవాఖానలలో డాక్టర్‌లపై దాడులు జరుగుతున్నాయని, ఇది చాలా బాధాకరమని చెప్పారు. డాక్టర్ అంటే చాలా కష్టపడి చదివి తన జ్ఞానాన్ని, అనుభవాన్ని దారబోసి పేషేంట్ బ్రతకలని చూస్తాడని, కానీ చావలని ఏ డాక్టర్ చూడడని, ఎంత దుర్వాసన వచ్చిన భరించి వైద్యం చేస్తారని, ఎక్కడో ఒక్క దగ్గర కొంతమంది మాత్రం వేరుగా ఉంటారని, కానీ ఇక్కడ అలా ఉండరని చెప్పారు.

Judas end strike on thursday night, Minister Etela talks with doctors

మొన్న గాంధీలో జరిగిన దాడి బాధాకరమని ఈటల చెప్పారు. క్రిటికల్ కండిషన్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తారని, కానీ డాక్టర్లపై దాడులు చేస్తే చట్టాలు ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని, డాక్టర్లకు 12 గంటలు పని నుండి కొంత వెసులుబాటు కల్పిస్తామని, ముందు ముందు
మరిన్ని చేసుకుంటూ పోతామన్నారు.

సమ్మె విరమించాలని తాము కోరామని, జుడాలు మాకు కొన్ని డిమాండ్‌లు పెట్టారని, వారి భద్రతతో పాటు ఆసుపత్రికి పరిమితికి మించి పేషేంట్ వస్తున్నారని, వారిని కూడా కొంత చూడాలని డిమాండ్ చేశారని చెప్పారు. దేవాలయంలాంటి తెలంగాణ ఆసుపత్రులను చూడాలని సీఎం కేసీఆర్ చెప్పారని, మానవత్వంతో డాక్టర్‌లు పని చేస్తున్నారని, దాడుల వంటి ఇలాంటి చిల్లర పనులు చేసే వారిని కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పారు.

ఇటీవల జరిగిన దాడికి సంబంధించి మంత్రి ఈటల చర్చలకు పిలిచారని,
సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, తమ సమస్యలు పరిష్కారం కాకుంటే తమ సమ్మె యధావిధిగా కొనసాగుతుందని జూడాలు చెప్పారు. మార్చి 11 వ తేదీ వరకు తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మె యధాతధంగా కొనసాగిస్తామని, తమకు ఇబ్బంది లేకుండా పేషెంట్‌లకు ఇబ్బంది లేకుండా భద్రత కల్పించాలన్నారు. అప్పుడే తమ విధులకు ఆటంకం లేకుండా ఉంటే ఎక్కువ పని చేస్తామన్నారు.

తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని జూడాలు చెప్పారు. గతంలో జరిన దాడి విషయంలో కూడా చర్యలు తీసుకోలేదని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
పేషెంట్‌తో వచ్చేవారు ఒక్కరు మాత్రమే అనుమతి ఇవ్వాలని, లోపలికి
పేషేంట్ చుట్టూ ఎక్కువ మంది రావడం వలన అనేక ఇబ్బంది అవుతోందన్నారు.

English summary
Judas end strike on thursday night, Minister Etela talks with doctors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X