హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జుడాలపై దాడి, విధులు బహిష్కరించి ఆందోళన: మంత్రి హామీతో..

గాంధీ ఆసుపత్రిలో బుధవారం జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. అర్థం లేకుండా రోగి బంధువులు తమపై దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు విధులు బహిష్కరించడంతో ఓపీతో సహా వైద్య సేవలు నిలిచాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో బుధవారం జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. అర్థం లేకుండా రోగి బంధువులు తమపై దాడి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు విధులు బహిష్కరించడంతో ఓపీతో సహా వైద్య సేవలు నిలిచాయి.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇవ్వడంతో జుడాలు ఆందోళన విరమించారు. పార్శీగుట్ట బాపూజీనగర్‌కు చెందిన మహ్మద్‌ చున్నూమియా)కు గుండెపోటు వచ్చింది.

Junior docs strike work at Gandhi Hospital

కుటుంబ సభ్యులు ఆయనను మంగళవారం అర్ధరాత్రి గాంధీకి తరలించారు. వారు పరీక్షిస్తుండగానే కుటుంబ సభ్యులు ఆయనను ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం ఖర్చు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు అవుతుందని చెప్పడంతో బుధవారం ఉదయం మళ్లీ గాంధీకి తీసుకొచ్చారు.

ఆయనను పరీక్షా కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందాడు. అయితే, డాక్టర్ల వల్లే మృతి చెందాడని కొడుకులు గౌస్, అజ్జు, బంధువులు ఓ జూనియర్ డాక్టర్ పైన దాడి చేశారు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. చెప్పులు విసిరారు.

Junior docs strike work at Gandhi Hospital

దీంతో జుడాలు ఆందోళనకు దిగారు. సుమారు 600 మంది విధులు బహిష్కరించారు. బంధువుల దాడిని నిరసించారు. రోగి ఎలా మృతి చెందాడో తేలాలంటే పోస్టుమార్టం నిర్వహించాలని, అప్పుడే బంధువులకు అప్పగించాలని జుడాలు డిమాండ్ చేశారు. మరోవైపు బంధువులు చొచ్చుకొచ్చారు.

దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం దాడి చేసిన వారి సోదరి బేగం మాట్లాడారు. తమ తండ్రి మృతిచెందిన బాధలో తన సోదరులు వైద్యులపై దాడి చేశారని, ఇందులో డాక్టర్ల తప్పు లేదని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఆ తర్వాత మృతదేహాన్ని అప్పగించారు. దాడి చేసిన వారుపై కేసు పెట్టారు.

English summary
Junior doctors at Gandhi Hospital struck work after three doctors were allegedly attacked by relatives of patient who died at the hospital during the wee hours of Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X