వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్స్‌లో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య: ఏమైందో మరి తెలియదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో ఓ జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నరాలు, నాడీ వ్యవస్థపై అతనికి పట్టు ఉందని చెబుతారు. శివతేజ రెడ్డి అనే ఆ డాక్టర్ ఆదివారం క్లబ్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలన్మరణం చెందాడు.

రోగులకు చికిత్స అందిస్తూనే తన సొంత డబ్బులతో వారికి సదుపాయాలు కూడా కల్పించేవాడు. అటువంటి సామాజిక స్పృహ కలిగిన వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

junior doctor commits suicide in NIMS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఎఫ్‌సిఐ రిటైర్డ్ ఉద్యోగి పులగం అప్పిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు శివతేజ రెడ్డి. అతనిది 31 ఏళ్ల వయస్సు. ఏలూరు ఆశ్రమ్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఎండి పూర్తి చేశాడు.

మహారాజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్)లో శివతేజ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ సూపర్ స్పెషాలిటీ కోర్టు చదివాడు. తిరుపతిలో నెఫ్రాలజీ విభాగంలో సీటు సంపాదించాడు. నెఫ్రాలజీ విభాగంలో 8 నెలలు పనిచేసిన తర్వాత మళ్లీ పరీక్ష రాసి నిమ్స్ న్యూమరాలజీ విభాగంలో సీటు సంపాదించాడు.

అతను నిరుడు సెప్టెంబర్‌లో హైదరాబాదు వచ్చాడు.అప్పటి నుంచి వారం రోజుల క్రితం వరకు బయటే ఉంటూ నిమ్స్‌లో విధులకు హాజరయ్యేవాడు. విధులు ముగిసిన తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఎక్కువగా గ్రంథాలయంలో గడిపేవాడు.

English summary
Junior doctor Shivateja Reddy has commited suicide in NIMS in Hyderabad. He was from West Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X