• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నడూ ఆ పనిచేయని కేసీఆర్ దళితుల ఓట్ల కోసమే అలా... రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే : ఈటల రాజేందర్

|

ఎన్నడూ అంబేడ్కర్,జగ్జీవన్ రామ్‌లకు దండ వేయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జైభీమ్ అని నినదించడం దళితుల ఓట్ల కోసమేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ దళితులపై ప్రేమతోనో లేక వారి జీవితాలను బాగుచేయాలనో దళితబంధు పథకం తీసుకురాలేదని... కేవలం వారి ఓట్లను కొనేందుకే ఆ పథకాన్ని తీసుకొచ్చారనిఅన్నారు.గొల్లకుర్మ సోదరులకు రూ.8వేల కోట్లతో గొర్లు పంపిణీ చేశామని చెబుతున్నారని... నిజంగా అందులో వారికి చెందినదెంత అని ప్రశ్నించారు.మిగతా డబ్బు ఎటువైపు వెళ్లిందని ప్రశ్నించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో... టీఆర్ఎస్ పాలన ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సాగడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు.వర్సిటీకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కష్టపడి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు

కష్టపడి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు

విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో... ఇవాళ విద్యార్థులకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుందో పాలకులు ఆలోచించాలన్నారు.విశ్వ విద్యాలయాలు చైతన్య కేంద్రాలని,అణచివేత,దోపిడీ,అక్రమాలపై బరిగీసి పోరాడిన గొప్ప నిలయాలని పేర్కొన్నారు.అలాంటి యూనివర్సిటీ విద్యార్థులకు ఇవాళ ఎక్కడా ఉపాధి లేకుండా పోయిందన్నారు. కష్టపడి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవన్నారు. యూనివర్సిటీల్లో సైతం కాంట్రాక్ట్ టీచర్లను నియమించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి పట్టిందన్నారు.

ముసలి తల్లులకు ఇంకా పెన్షన్ అందలేదు..

ముసలి తల్లులకు ఇంకా పెన్షన్ అందలేదు..

హుజురాబాద్‌లో ఎలా దౌర్జన్యం చేయాలి... ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచన తప్ప విద్యార్థులకు మంచి చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. ఈ నెల 20వ తేదీ గడిచిన ముసలి తల్లులకు పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితి మన ధనిక రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవం కోల్పోదని అన్నారు.విద్యార్థులు చేసే న్యాయపరమైన పోరాటాలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. హుజురాబాద్ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని కూల్చే ఎన్నిక కావాలని అన్నారు. అది తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించే ఎన్నికగా నిలవాలన్నారు.

ఇదేం నీతి... ఇదేం వివక్ష...

ఇదేం నీతి... ఇదేం వివక్ష...

రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని... కొత్తగా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చాయన్నారు. డబ్బు ఉన్నవాళ్లు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి రావడం లేదన్నారు. విశ్వవిద్యాలయాలు డబ్బున్నవారివి డబ్బులేని వారివిగా విభజించబడ్డాయని పేర్కొన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమంతి ఇచ్చేటప్పుడు అక్కడ కూడా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.రిజర్వేషన్లతో మెరిట్ పోతుందని చెప్పేవారు... మరి క్వాలిఫై కాకపోయినా డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుని చదివేవారి గురించి ఏమంటారని ప్రశ్నించారు. ఇదేం నీతి... ఇదేం వివక్ష అని నిలదీశారు. అంబేద్కర్ 25 ఏళ్ల తరువాత రిజర్వేషన్లు పోతాయని అనుకున్నారని... కానీ ఆయన చెప్పినట్లు డెవలప్‌మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబూషన్ జరగలేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలు ఎందుకు జరగడం లేదన్నారు.తెలంగాణ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.మానవ సంపద నిర్వీర్యం కావడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు.

నోటిఫికేషన్లు ఇంకెప్పుడు...

నోటిఫికేషన్లు ఇంకెప్పుడు...

దేశంలో కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే వేల కోట్ల రూపాయాల సంపద పోగుబడి ఉందన్నారు.బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలు కన్నట్లు సంపద వికేంద్రీకరణ జరగలేదన్నారు.డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.చదువుకున్న పిల్లలు కూలీ పనులకు వెళ్తున్నారని అన్నారు.కొడుకులను చదివించకున్నా బాగుండని తల్లులు ఆవేదన చెందే రాష్ట్రంలో దుస్థితి నెలకొందన్నారు. గ్రామాల్లోకి వెళ్తే ఉద్యోగం గురించి అడుగుతారని... చాలామంది విద్యార్థులు గ్రామాలకే వెళ్లట్లేదని అన్నారు. ప్రభుత్వానికి మనసు ఉంటే ఈ పరిస్థితిని మార్చవచ్చునని... కానీ ప్రభుత్వానికి ఆ మనసు లేదన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికప్పుడు,ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు.

English summary
Former minister Etala Rajender has criticized that Telangana Chief Minister KCR, he said who never garlands for Ambedkar and Jagjivan Ram, but for dalit votes he given the slogan of JAI BHIM.He alleged that the Dalitbandhu scheme was not brought out of love for the Dalits or to improve their lives ... it was brought just to buy their votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X