వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ సరే.. అప్పుల ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తారా.. జస్టిస్ చంద్రకుమార్ లాజిక్‌తో కొట్టారుగా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

TSRTC Samme : All Telangana Political Parties Supports To RTC Employees || Oneindia Telugu

హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న తీరును వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి. ఆ క్రమంలో జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నల వర్షం హాట్ టాపికైంది. అప్పుల్లో ఉందంటూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తామంటున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ ఎద్దేవా చేశారు. 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని హితవు పలికారు.

అఖిల పక్ష సమావేశానికి నేతలు హాజరు

అఖిల పక్ష సమావేశానికి నేతలు హాజరు

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విధానాలను ఖండిస్తోంది కార్మిక లోకం. సమ్మెను అణిచివేసే ధోరణిలో ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఆ క్రమంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలను, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలను ఆహ్వానించారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తలపెట్టిన ఆల్ పార్టీ మీటింగ్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు హాజరయ్యారు.

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఎఫెక్ట్.. అదుపుతప్పి వాగులోకి బస్సుఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఎఫెక్ట్.. అదుపుతప్పి వాగులోకి బస్సు

కోదండరాం అధ్యక్షతన సమావేశం.. గవర్నర్ దగ్గరకు వెళ్లే యోచన..!

కోదండరాం అధ్యక్షతన సమావేశం.. గవర్నర్ దగ్గరకు వెళ్లే యోచన..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం (09-10-2019) నాడు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జస్టిస్‌ చంద్రకుమార్‌, టీఎంయూ ఆర్టీసీ యూనియన్‌ అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కార్మికులు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ సమ్మెపై ఏ విధంగా ముందుకెళ్లాలి.. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రభుత్వాన్ని ఎలా ఎదురించాలి.. తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా గవర్నర్ దగ్గరకు వెళ్లి ఆర్టీసీ కార్మికుల సమస్యను విన్నవించాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది.

ఆర్టీసీపై ప్రభుత్వానికి చిన్న చూపు తగదు

ఆర్టీసీపై ప్రభుత్వానికి చిన్న చూపు తగదు

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న అశ్వత్థామ రెడ్డి సంచలన ప్రకటన చేయడం హాట్ టాపికైంది. ఆర్టీసీ సమ్మెను చిన్నచూపు చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ దిగిరాని పక్షంలో తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

కర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తంకర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తం

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మె.. త్వరలో భారీ బహిరంగ సభ

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మె.. త్వరలో భారీ బహిరంగ సభ

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు చేసిన అలుపెరగని పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు అశ్వత్థామ రెడ్డి. అదే క్రమంలో ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలవాలని కోరారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తితోనే ఈనాడు ఆర్టీసీని కాపాడుకునేందుకు ఈ సమ్మె చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఏదైనా సందర్భంలో ఉద్యోగ సంఘాలను నొప్పించే తీరుగా మాట్లాడితే క్షమించాలని.. ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అఖిల పక్షం నేతలతో పాటు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నేతలను అందరినీ కలుపుకుని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

English summary
justice chandra kumar sensational comments on trs government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X