హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ ఆటోవాలాపై అమెరికా మహిళ ప్రతీకారం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆటోవాలాపై ఓ అమెరికా మహిళ సరికొత్త పద్ధతిలో ప్రతీకారం తీర్చుకుంది. ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. హైదరాబాదుకు చిరపరిచితురాలైన ఆమె ముప్పు తిప్పలు పెట్టిన ఓ ఆటోవాలా సాగించిన బేరసారాల వీడియోను సోషల్ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

జార్జి‌టౌన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ సి. క్రిస్టీన్ ఫెయిర్ దక్షిణ ఆసియా భాషలు, సాంస్కృతిక మార్పులు అనే అంశపై పరిశోధనలు చేస్తోంది. తన పరిశోధనలో భాగంగా ఆమె 1997 నుంచి పలుమార్లు హైదరాబాదుకు వచ్చి వెళ్లింది.

ఉర్దూహిందీ కలగలిసిన హైదరాబాదీ భాషపై ఆమె పట్టు సాధించింది కూడా. మూడు రోజుల క్రితం ఆమె బస చేసిన హోటల్ నుంచి బయటికి వచ్చి ఆటో కోసం కేకలు వేసింది. చార్మినార్‌కు వెళ్లాలని ఆటోవాలాకు చెప్పింది. విదేశీయురాలు కాబట్టి పర్స్ నిండా మనీ ఉంటుందని, చార్మినార్ ఎంత దూరమో కూడా తెలిసి ఉండదని భావించిన ఆటోవాలా డబ్బులు దండుకోవాడనికి ఉవ్విళ్లూరాడు.

 K Nishanth: Revanth Reddy insults work culture

మీటర్ మీద చార్మినార్‌కా రావాలని ఆమె ఆటోవాలను అడిగింది. అలా కుదరదని, తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని అతను చెప్పాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత ఆటోలో కూర్చుని మొబైల్ కెమెరా ఆన్ చేసి ఆటోవాలా తీరును వీడియో తీసింది.

కావాలంటే రోజంతా ఖాళీగా ఉంటాను గానీ మీటర్‌పై మాత్రం రానని ఆటోవాలా తెగేసి చెప్పాడు. ఆ మాటను ఆమె రిపీట్ చేసింది. మధ్యమధ్యలో బాలీవుడ్ సాంగ్స్‌ను హమ్ చేసింది. అయితే, చివరికి ఆటోవాలా దిగి వచ్చి మీటర్ రేటుకు ఆమెను చార్మినార్ వద్ద దిగబెట్టడానికి అంగీకరించాడు.

English summary
An American lady taught lesson to an autowala in Hyderabad by picturising his actions and words.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X