వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాల్ .. ఇదేం పని : స్పాన్సర్‌షిప్ లెటర్ పేరుతో మోసం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఆయనో పార్టీ అధినేత .. ఎన్నికల్లో గెలవకున్నా ... ప్రజలందరికీ సుపరిచితం. చెప్పేవి శ్రీరంగ నీతులు ... కానీ చేసే పనులు మాత్రం వెలుగులోకి వస్తున్నాయి. ఓ అభాగ్యురాలికి స్పాన్సర్‌షిప్ లెటర్ ఇస్తానని రూ. 2 లక్షలు తీసుకొని .. ఆమె నంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. దీంతో అతనిపై పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు.

విజిటి వీసా స్పాన్సర్‌షిప్ లెటర్ కోసం ..
రామచంద్రాపురానికి చెందిన సత్యవతి అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా కోసం ప్రయత్నించారు. ఇంతలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ను ఆశ్రయించారు. తనకు స్పాన్సర్‌షిప్ లెటర్ ఇవ్వమని కోరితే .. డబ్బులు డిమాండ్ చేశాడు పాల్. ఈ డీల్‌లో జ్యోతి, విజయ్ రంగప్రవేశం చేశారు. రూ.15 లక్షలు ఇవ్వాలని షరతు విధించాడు. అంత ఇచ్చుకోలేని చెప్పడంతో వారితో రూ.2 లక్షలకు డీల్ కుదిరింది. చెప్పినట్టు రూ.2 లక్షల చెక్ ఇచ్చారు సత్యవతి. చెక్ తీసుకొని బ్యాంకు డ్రా చేసిన పాల్ .. తర్వాత స్పాన్సర్‌షిప్ లెటర్ సంగతి మరచిపోయాడు.

ka paul cheated women for sponsorship letter

బ్లాక్‌లిస్టులో ఫోన్ నంబర్
తాను అమెరికా వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్ లెటర్ కోసం కేఏ పాల్‌ను కలిసింది సత్యవతి. రేపు, మాపు అని చెప్పి కాలం వెళ్లదీశాడు. తర్వాత ఫోన్లు కూడా చేసింది. కొద్దిరోజులు ఫోను లిప్ట్ చేసిన పాల్ .. సత్యవతి ఫోన్ బ్లాక్ లిస్టులో పెట్టాడు. దీంతో తాను మోసపోయానని సత్యవతి గ్రహించింది. ఇవాళ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో పాల్ అండ్ కో పై ఫిర్యాదు చేసింది. సత్యవతి కేసు నమోదు చేసి .. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Satyavati of Ramachandrapuram tried to visit the America. Meanwhile, the KA Paul to give a sponsorship letter to her, Jyothi and Vijay made the debut in this issue. Rs. 15 lakhs was conditioned. Deal got Rs 2 lakh with them as they could not afford.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X