వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిల్లరీపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్య, ఒబామా-గడాఫీ మధ్య ఒప్పందం

అడపాదడపా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్.. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన హిల్లరీ క్లింటన్ పైన షాకింగ్ కామెంట్లు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అడపాదడపా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్.. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన హిల్లరీ క్లింటన్ పైన షాకింగ్ కామెంట్లు చేశారు.

ఇరాక్, లిబియాను నాశనం చేయడానికి, అలాగే గడాఫీని చంపించేందుకు హిల్లరీ కుట్ర పన్నారని ఆరోపించారని తెలుస్తోంది. గడాఫీ పిలిచినప్పుడు తాను లిబియా వెళ్లానని, గడాఫీ - బరాక్ ఒబామాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానని చెప్పారు.

ఆ అగ్రిమెంటును హిల్లరీ క్లింటన్ తిరస్కరించారని ఆరోపించారు. తనను చంపడానికి కూడా ప్రయత్నించారన్నారు. అగ్రిమెంటు తర్వాత గడాఫీ లొంగిపోయాడని, అతనిని చంపేందుకు ప్రయత్నించారన్నారు.

నారా లోకేష్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్!: సంచలన వ్యాఖ్యలునారా లోకేష్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్!: సంచలన వ్యాఖ్యలు

KA Paul Responds on Kansas firing and interesting comments on Hillary

అలాగే తన వద్ద ఉన్న కోట్లాది రూపాయల సంపద అదృశ్యమైందని చెప్పారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక తన పాత్ర ఉందని చెప్పారు. కొన్ని దేశాలు నాశనం కావడానికి హిల్లరీ విధానాలే కారణమన్నారు.

డొనాల్డ్ ట్రంప్ పైన వ్యతిరేకత పెరుగుతోందని కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడో బార్లో జరిగిన ఘటనకు ట్రంప్‌కు సంబంధం ఏమిటని కాన్సాస్ కాల్పుల ఘటన అంశంపై ప్రశ్నించారు.తన పేరు మీద ట్విట్టర్లో వస్తున్న కామెంట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

English summary
KA Paul Responds on Kansas firing and make interesting comments on Hillary Clinton.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X