హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌పై వేటు.. సంతానమే కారణమా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : కార్పొరేటర్‌గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారనే కారణంతో ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు ముగ్గురు సంతానమున్నా.. ఎన్నికల అఫిడవిట్‌లో ఇద్దరిని మాత్రమే చూపించారనే సాకుతో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవి భర్త రమేశ్ యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రమేశ్ యాదవ్ ఫిర్యాదు మేరకు న్యాయస్థానంలో కేసు నడిచింది. ఆ క్రమంలో బుధవారం నాడు ఎక్కాల కన్నా చైతన్య ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు విచారణలోనూ ఆమె తనకు ముగ్గురు సంతానం ఉన్నారనే విషయం దాచిపెట్టినట్లు రుజువైంది. దాంతో సదరు కార్పొరేటర్‌పై అనర్హత వేటు వేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.

kachiguda woman corporator disqualified due to three childs


ఆమెను కార్పొరేటర్ పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచినవారికి ఆ పదవి కట్టబెట్టాలని సూచించింది. దాంతో అప్పటి ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానం దక్కించుకున్న బీజేపీ లీడర్, మాజీ కార్పొరేటర్ ఉమాదేవికి అవకాశం దక్కినట్లైంది. అదలావుంటే కోర్టు తీర్పుతో ఉమాదేవి రమేశ్ యాదవ్ అనుచరుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

English summary
Hyderabad Nampally Court given ultimate judgement. Court disqualified Kachiguda TRS woman corporator for her false information. Actually she had three children, but mentioned as two in affidavits. For that opposition party leaders filed a petition in court. After investigation court concludes that her information is as false.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X