హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Kadaknath Chicken:ఈ కోళ్లు చాలా హాట్ గురూ..కిలో చికెన్ రూ. వెయ్యిపై మాటే:ఎందుకంత స్పెషల్..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: ఈ చికెన్ చాలా హాట్ గురూ.. అవును ఈ చికెన్ నిజంగానే చాలా హాట్. ఎందుకంటారా అక్కడికే వస్తున్నాం. ఈ మధ్యకాలంలో కడక్‌నాథ్ చికెన్ గురించి వినేఉంటారు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్లు బిజినెస్ పెడుతున్నట్లు వార్తలు వచ్చాక కడక్‌నాథ్ చికెన్ అంటే ఏంటి.. కడక్‌నాథ్ కోళ్లు అంటే ఏంటి అని తెలుసుకునేందుకు నెటిజెన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేశారు. మొత్తానికి ఈ చికెన్ కథ ఏంటో మనమూ తెలుసుకుందాం.

కిలో కడక్‌నాథ్ చికెన్ వెయ్యి రూపాయల పైమాటే

కిలో కడక్‌నాథ్ చికెన్ వెయ్యి రూపాయల పైమాటే


కడక్‌నాథ్ కోళ్లు.. ఈ కోళ్ల ధర చాలా ఎక్కువే. ఇక కడక్‌నాథ్ చికెన్ ధర అయితే హైదరాబాదులో కిలో రూ.1000 నుంచి రూ 1200 వరకు పలుకుతోంది. దీనికెందుకు ఇంత రేటు అంటే మరి ఈ కోళ్ల స్పెషాలిటీ అలా ఉంది. కడక్‌నాథ్ కోడి మాంసం నల్లటి రంగులో ఉంటుంది. కోడి కూడా ఇదే రంగులో ఉంటుంది. అయితే కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అతి తక్కువగా క్రొవ్వు పదార్థం ఉంటుంది. మంచి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధరీ భారీగా పలుకుతోంది. దీనికోసం వెయ్యి రూపాయలు కూడా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు మాంసాహార ప్రియులు. ఇక బతికున్న కోడి కిలో రూ.800 వరకు పలుకుతోంది.

బ్రాయిలర్ కోళ్లకు కడక్‌నాథ్‌ కోళ్లకు తేడా ఏంటి..?

బ్రాయిలర్ కోళ్లకు కడక్‌నాథ్‌ కోళ్లకు తేడా ఏంటి..?


సాధారణంగా కడక్‌నాథ్ బ్రీడ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది.ఈ కోడి మొత్తం నలుపురంగులోనే ఉంటుంది. దీని గుడ్లు కూడా నల్లగా ఉంటాయనే ప్రచారం ఉన్నప్పటికీ వాస్తవానికి అవి కాస్త కాఫీరంగుతో పాటు కొంత పింక్ కలర్‌లో ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్లను మాంసం కోసం గుడ్లు కోసం పెంచుతారు. అయితే ఇది మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్‌లో దొరికే బ్రాయిలర్ కోళ్లు అయితే 45 రోజుల్లోనే ఒక్కింత బరువు తూగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్‌నాథ్ కోడికి తేడా తెలుస్తుంది. కడక్‌నాథ్ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. దీనికి అయ్యే మెయిన్‌టెనెన్స్ ఖర్చు కూడా బాగానే ఉంటుంది. అందుకే ధర అధికంగా పలుకుతున్నాయి.

కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి మంచిది

కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి మంచిది

వికారాబాద్‌లోని ఓ కోళ్ల ఫారంలో దాదాపుగా 4వేల కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్నారు. ఆరోగ్యపరంగా కడక్‌నాథ్ చికెన్ చాలా మంచిది కాబట్టే ఇక్కడ ఆ జాతికోళ్లను పెంచుతున్నట్లు ఫార్మ్ యజమానులు చెబుతున్నారు. కేవలం కడక్‌నాథ్ కోళ్ల కోసమే ప్రత్యేకమైన ఫార్మ్ తయారు చేసినట్లు చెబుతున్నారు. ఇక కిలో కడక్‌నాథ్ చికెన్ రూ.1000 నుంచి రూ.1200 పలుకుతుండగా గుడ్ల ధర కూడా అధికంగానే ఉన్నాయి. ఒక్క గుడ్డు ధర రూ.30గా ఉంది. వృద్ధులకు, హైబీపీ ఉన్నవారు కడక్‌నాథ్ గుడ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. కడక్‌నాథ్ గుడ్లకు డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఉత్పత్తి అంత ఎక్కువగా లేకపోవడంతో ధరలు ఎక్కువగా ఉన్నాయని వీటిని పెంచుతున్న రైతు ఒకరు చెప్పారు.

English summary
Kadaknath chicken is now the costliest meat available in Hyderabad, according to its dealers. The meat is being sold at Rs 1,000 to Rs 1,200 per kg in the city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X