వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజయ్యే తప్పుగా ప్రవర్తించారు: కేటీఆర్ ఎదుట తమ్ముడంటూనే కడియం చురకలు

|
Google Oneindia TeluguNews

వరంగల్: టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మరో సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యపై మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ వైపు నుంచి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిస్తూనే కడియం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Recommended Video

Telangana Elections 2018 : TRS కు పెరుగుతున్న వ్యతిరేకత....!

<strong>చంద్రబాబును అభినందించిన వీహెచ్, 'నవంబర్ తొలివారంలో అభ్యర్థుల ప్రకటన'</strong>చంద్రబాబును అభినందించిన వీహెచ్, 'నవంబర్ తొలివారంలో అభ్యర్థుల ప్రకటన'

కేసీఆర్ ఆదేశాలతో..

కేసీఆర్ ఆదేశాలతో..

తన కుమార్తె కావ్యకు టికెట్ ఇవ్వకపోవడంతో కొంత కాలంగా అంటిముట్టనట్లుగా వ్యవహరించిన కడియం.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ సభలో పాల్గొని ప్రసంగించారు.

రాజయ్యను గెలిపించాలి..

రాజయ్యను గెలిపించాలి..

ఈ సందర్భంగా కడియం ప్రసంగిస్తూ.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అసమ్మతి లేదు, సమ్మతి లేదంటూనే రాజకయ్యకు కడియం చురకలంటించారు.

రాజయ్యే తప్పుగా ప్రవర్తించారు... కానీ

రాజయ్యే తప్పుగా ప్రవర్తించారు... కానీ

‘నేను నియోజకవర్గానికి రాకపోవడంతో అలిగానని బహుశా మీరంతా అనుకుంటున్నారేమో.. నేను నిజంగా చెబుతున్నా.. రాజయ్య అప్పుడప్పుడు నా పట్ల తప్పుగా ప్రవర్తించినా.. నేను ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదు' అని కడియం చెప్పారు.

రాజయ్యను తమ్ముడంటూ..

రాజయ్యను తమ్ముడంటూ..

అంతేగాక, ‘రాజయ్య నా తమ్ముడు. టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు. రాజయ్యను మనమందరం తప్పకుండా గెలిపించుకోవాలి. భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలి' అని సభకు హాజరైన ప్రజలకు కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.

English summary
Telangan Deputy CM and TRS leader Kadiyam Srihari satirical comment on Station Ghanpur TRS MLA candidate T Rajaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X