వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ గులాబీల లొల్లి; కడియం శ్రీహరి వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య; వీళ్ళు మారరు!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం కోసం గులాబీ బాస్ కలలు కంటున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో రెండు దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మూడవ దఫా కూడా గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తుంటే పార్టీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టటం లేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు, టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యల మధ్య పంచాయితీ పీక్స్ కి చేరుకుంది.

దళిత బంధు పథకంపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

దళిత బంధు పథకంపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు


ఇప్పటికే అనేకసార్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ల మధ్య పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, తాజాగా మరొకమారు ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇటీవల స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కొందరు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారని, లేదా లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుని దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు.

కడియం వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్..

కడియం వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్..


ఇక కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించే అని భావించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరికి ఇండైరెక్ట్ గా నే కౌంటర్ వేశారు. దళిత బంధు విషయంలో కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఆ విధంగా మాట్లాడితే మంచిది కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలి అని హెచ్చరించారు. భాష మార్చుకోవాలని పరోక్షంగా కడియం శ్రీహరి ని టార్గెట్ చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే సుప్రీమ్ అని తేల్చి చెప్పిన ఆయన, లబ్ధిదారులకు ఏం లబ్ధి జరిగినా అది ఎమ్మెల్యే ద్వారానే జరుగుతుందని చెప్పారు.

గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే రావని వ్యాఖ్య

గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే రావని వ్యాఖ్య

సీఎం దగ్గర ఎవరికీ స్పెషల్ కోటా ఏమీ ఉండదని, ఒక ఎమ్మెల్యే కోటానే నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. గాడిదకు గడ్డి వేసి ఆవు పాలు పిండితే రావు అంటూ పేర్కొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోమారు కడియం శ్రీహరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్ళీ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

స్టేషన్ ఘనపూర్ లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు

స్టేషన్ ఘనపూర్ లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తన్నుకుంటున్న తీరు అక్కడ వారిని విస్మయానికి గురిచేస్తుంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో ప్రత్యర్థి పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో సొంత పార్టీల నేతలే బలంగా తన్నుకుంటున్న పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది . పోటాపోటీగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాలు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరోమారు చర్చనీయాంశంగా మారుతోంది.

సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష: ప్రజలనే బుట్టలో వేసే పనిలో కేసీఆర్ చేస్తుందిదే!!సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష: ప్రజలనే బుట్టలో వేసే పనిలో కేసీఆర్ చేస్తుందిదే!!

English summary
The battle of TRS Leaders continues at station Ghanpur. The political war between Kadiyam Srihari vs Tatikonda Rajaiah continues. In the case of the Dalit Bandhu scheme, the heated comments between the two turned ugly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X