తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ఏపి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఏపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఏపి లో టిఆర్ఎస్ లేనప్పుడు ఏపిలో మీకేం పని అంటు లేఖ పేర్కోన్నారు..దీంతోపాటు పలు ప్రశ్నలను ఆయన సంధించారు..జగన్ కు వెయ్యి కోట్లు ఎన్నికల ఖర్చు కోసం పంపారంటూ ఆరోపణలు చేశారు.
ఏపీ, తెలంగాణ చిచ్చు..! పట్టు సడలిందా డాటా చోరీ కేసు?
ఏపీలో టీఆర్‌ఎస్ పార్టీ లేదు. అలాంటప్పుడు ఏపీలో మీకేం పని ఉంది..? వైసీపీ జెండా నీడలో దాక్కొని చంద్రబాబునాయుడుపై దొంగ యుద్ధం మోదీ ఆదేశాలతో చేస్తున్నారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే పార్టీ.. కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి ముందు వైఎస్ కుటుంబాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా నోటికొచ్చిన విమర్శలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు అదే వారసత్వాన్ని తలకెత్తుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలలో మీ కన్నా ఉత్తమ పాలన అందిస్తున్న చంద్రన్న పాలనను దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. సామంతరాజును ఏర్పాటు చేసుకొని ఏపీ వనరులను దోచుకునే కుట్ర చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి రూ. వెయ్యి కోట్లు డబ్బు పంపారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను రావణకాష్టంగా మార్చే కుట్రలు చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్రులు మీ కుట్రల్ని, జగన్ హత్యా రాజకీయాలకు బుద్ధి చెప్పి అభివృద్ధి, సంక్షేమాన్ని అఖండ మెజారిటీతో గెలిపించబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే దాదాపు 25 ప్రశ్నలను సంధించారు..వీటిలో ముఖ్యంగా
అవినీతి అక్రమాలతో 31 కేసుల్లో దోషిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి మీరు మద్దతుగా నిలవడం కృష్ణా, గోదావరి జలాలను హస్తగతం చేసుకోవడానికి కాదా? నవ్యాంధ్రను ఎడారిగా మార్చాలనేది మీ అజెండాలో లేదా..?
నవ్యాంధ్ర ఆస్తులైన నౌకాశ్రయాలను దక్కించుకోవడం, తద్వారా పరిశ్రమలపై దెబ్బకొట్టి తెలంగాణలోని పరిశ్రమలను వృద్ధి చేసుకోవడం మీ అజెండా కాదా?
మచిలీపట్నం పోర్టులో బెర్తులు కావాలని డిమాండ్ చేస్తే రాష్ట్ర పారిశ్రామిక అవసరాల దృష్ట్యా ఇవ్వనందుకు వాటిని ఎలాగైనా దక్కించుకోవాలన్న కాంక్షతో జగన్ ను మీరు ముఖ్యమంత్రి చేయాలనుకోవాడం వాస్తవం కాదా?
జగన్ లాంటి అవినీతి పరుడిని తెలంగాణ జైళ్లలో కూడా పెట్టొద్దని మీ కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్ విమర్శించారు. నేడు అలాంటి వ్యక్తిని మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి ఎందుకు తాపత్రయపడుతున్నావు?
.వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పార్టీగా జగన్ మార్చుకున్న మాట వాస్తవం కాదా? ఆ పార్టీకి మీరు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించడం వాస్తవం కాదా?
అంటూ పలు ప్రశ్నలతో కూడిన లేఖను విడుదల చేశారు..అయితే దీనిపై తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ఏమేరకు స్పందిస్తారో వేచి చూడాలి.