• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాళేశ్వరానికి నీళ్ళు ... బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు .. బాల్క సుమన్ సెటైర్లు

|

ఈ నెల 21 న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించని కేసీఆర్ ఏపీ సీఎం జగన్ ను, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను ఆహ్వానించారు . ఇక అంతే కాదు కేంద్రం నిధులు ఏమీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఇవ్వలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . దీంతో తెలంగాణా బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగారు. ఇక కాంగ్రెస్ నేతలు సైతం జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావటాన్ని ఆక్షేపించారు. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మరియు బీజేపీ నేతలపై ఫైరయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్.

అచ్చెన్నాయుడుకి ఒకే ఒక్క గన్ మ్యాన్ ..వద్దని వెనక్కు పంపిన అచ్చెన్నఅచ్చెన్నాయుడుకి ఒకే ఒక్క గన్ మ్యాన్ ..వద్దని వెనక్కు పంపిన అచ్చెన్న

  పెళ్ళికొడుకు ఏ రామోజీ మనవడో, అంబానీ తమ్ముడో కాదు
   కాళేశ్వరం పూర్తి చేసిందనే కడుపు మంటతోనే కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు అన్న బాల్క సుమన్

  కాళేశ్వరం పూర్తి చేసిందనే కడుపు మంటతోనే కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు అన్న బాల్క సుమన్

  టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే బాల్క సుమన్ . తెలంగాణా సర్కార్ రికార్డు టైంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చెయ్యటమే కాంగ్రెస్ , బీజేపీ ఆరోపణలకు కారణం అని సుమన్ పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ శరవేగంతో కాళేశ్వరం పూర్తి చేసిందనే కడుపు మంటతోనే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని సుమన్ ఫైర్ అయ్యారు .ఉత్తర, మధ్య తెలంగాణలోని బీడు భూములను తడిపేందుకు , తెలంగాణాను సస్య శ్యామలం చేసేందుకు కేసీఆర్ కార్యాచరణ రూపొందించారన్నారు. కాళేశ్వరంపై జీవన రెడ్డి వ్యాఖ్యలు దారుణమని సుమన్ మండిపడ్డారు. కాళేశ్వరం చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

  కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేకపోయింది .. ఇప్పుడు ఏడుస్తుంది అన్న ఎమ్మెల్యే సుమన్

  కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చెయ్యలేకపోయింది .. ఇప్పుడు ఏడుస్తుంది అన్న ఎమ్మెల్యే సుమన్

  కాంగ్రెస్ హయాంలో శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్ర వందల ప్రాజెక్టులు కడుతున్నా అప్పటి టీ. కాంగ్రెస్ నేతలు ఏం చేయలేకపోయారని సుమన్ మండిపడ్డారు. సహనం కోల్పోయి మాట్లాడుతోంది సీఎం కేసీఆర్ కాదు బీజేపీ నేతలే అన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ నిజాలు నిజాలుగా మాట్లాడితే బీజేపీ నేతలకు మంచిదని హితవు పలికారు.. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి అవగాహన లేకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడి హట్టి కంటే మేడిగడ్డ దగ్గరే నీటి లభ్యత ఎక్కువ ఉందనే విషయాన్ని కేంద్రజలసంఘం చెప్పిందని జీవన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. ఇక అంచనా వ్యయం పెంపు పై కూడా జీవన్ రెడ్డి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టు భారీగా పెరిగింది కనుకే అంచనా వ్యయం పెరిగిందన్నారు బాల్క సుమన్ . కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా సాగునీటి ఒప్పందాలు కుదుర్చుకొలేక పోయారని ఎద్దేవా చేశారు.

   కాళేశ్వరానికి త్వరలోనే నీళ్ళు .. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కన్నీళ్లు అంటూ సుమన్ సెటైర్లు

  కాళేశ్వరానికి త్వరలోనే నీళ్ళు .. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కన్నీళ్లు అంటూ సుమన్ సెటైర్లు

  కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులంటే పెండింగ్ అనీ .. కేసీఆర్ హాయంలో ప్రాజెక్టులంటే రన్నింగ్‌ అనీ అభివర్ణించారు బాల్క సుమన్. కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తున్నాయని పేర్కొన్న బాల్క సుమన్ .. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఇక కన్నీళ్లే మిగులుతాయని సుమన్ సెటైర్లు వేశారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

  English summary
  TRS MLA Balka Suman said CM KCR in a record time has completed the Kaleswaram Lift Irrigation Project and added that it is going to be inaugurated on June 21st. In a Press Meet, TRS MLA has countered the opposition leaders particularly Congress MLA Jeevan Reddy alleging that he lacked the knowledge of actual facts of the projects. He has hit out at the previous Congress government in Telangana alleging that many projects were pending during their time and added that after TRS government has come into power, the projects works started running. TRS MLA of Chennur (sc) constituency has read out the names of various pending projects saying that they are under running mode.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X