వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్, బీజేపీల మధ్య మరింత అగాధం పెంచిన... కాళేశ్వరం ఆహ్వానాలు, నిధులు ...

|
Google Oneindia TeluguNews

కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు, ప్రారంభోత్సవ ఆహ్వానం బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య చిచ్చుపెడుతోంది.. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పక్క రాష్ట్ర్రాల సీఎంలను ఆహ్వానించిన సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్ర్రంలో ఉన్న స్థానిక బీజేపీ ఎంపీలకు కూడ ఆహ్వానాలు పంపలేదు.. దీంతో ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల తర్వాత మధ్య విమర్శల బాణాలు సంధించుకుంటున్నాపార్టీల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు మరింత ఆగాధాన్ని పెంచుతోంది...

జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం

జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ట్రాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఇందులో అతి కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులు, అనుమతులు సమకూర్చుకుని తెలంగాణ ప్రజలకు నీళ్లను అందివ్వబోతుంది. మరోవైపు దేశంలో భారీ ఇంజనీరింగ్‌తో పాటు అత్యధిక నిధులు వెచ్చించే ప్రాజెక్టుగా రికార్డు కెక్కిన ప్రాజెక్టు కొద్ది రోజుల్లోనే తెలంగాణ రైతులకు ఫలితాలను ఇవ్వబోతుంది.

Recommended Video

పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి - కేసీఆర్
ప్రారంభోత్సవ ఆహ్వానాలపై వివాదం..

ప్రారంభోత్సవ ఆహ్వానాలపై వివాదం..

అయితే ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న సంధర్భంలో ప్రారంభోత్సవానికి సిద్దమైంది. దీంతో సీఎం కేసీర్ జూన్ 21న ఇరు మహారాష్ట్ర్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌లకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అయితే దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టుకు పీఎం నరేంద్రమోడీని కనీసం ఆహ్వానించక లేదు. మరోవైపు తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలను కూడ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదు. దీంతో ఆపార్టీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులతోపాటు ఇతర అంశాల్లో కేంద్రం జోక్యం వల్లే ప్రాజెక్టు పూర్తవుతుందని ఎంపీ అన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రతి దానికి ప్రధానిని ఆహ్వానించాల్సిన అవసరం లేదని,కేంద్రానికి రాజ్యంగబద్దమైన విషయాలపైన సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు.

నిధులపై వివాదం...

నిధులపై వివాదం...

ఇఖ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రుపాయి కూడ ఇవ్వలేదని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఒక దశలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరినా పట్టించుకున్న పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర్ర ప్రభుత్వమే బ్యాంకుల కన్సార్టీయంతో నిధులను సమకూర్చుని ప్రాజెక్టును దశల వారిగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటీ వివాదం లేకుండా పక్క రాష్ట్ర్రాలతో స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకుని ఎలాంటీ అడ్డంకులు లేకుండా ప్రాజెక్టును నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

11 ప్రాజెక్టులకు 11 వేల కోట్లు లక్ష్మణ్

11 ప్రాజెక్టులకు 11 వేల కోట్లు లక్ష్మణ్

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు ఎంత నిధులను ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలియదని,నిధుల కోసం అప్పటి మంత్రి హరీష్ రావు ఢిల్లీకి అనేక సార్లు వెళ్లాడని బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తెలిపారు. ఈనేఫథ్యంలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి నిధులు అడిగితేనే ఆయన తెలుస్తుందంటూ విమర్శలు చేశారు. ఇక తెలంగాణలోని మొత్తం 11 సాగునీటీ ప్రాజెక్టులకు 11వేల కోట్ల రుపాయలను కేంద్రం ఇచ్చిందని ఆయన అన్నారు.ఇక కేంద్రంతో పాటు,మహారాష్ట్ర్రలో కూడ బీజేపీ అధికారంలో ఉండడం వల్లే పర్యవరణ అనుమతులు వచ్చాయని అన్నారు.కేంద్రం ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచడం వల్లే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని అన్నారు.

English summary
Kaleshwaram Project Funding and Invitation of Inauguration are getting disputes Between the BJP and TRS parties. CM KCR CM invites did not invite the Prime Minister Narendra Modi as well as local BJP MPs in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X