వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరం వెట్ రన్ సక్సెస్ .. ట్వీట్ కే పరిమితం అయిన హరీష్ రావు

|
Google Oneindia TeluguNews

కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయ్యింది . మొదటి పంపు వెట్ రన్ సక్సెస్ కావడం పట్ల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు బుధవారం నాడు వెట్ రన్ విజయవంతం కావడంతో కేవలం ట్వీట్ కే పరిమితం కావాల్సి వచ్చింది .

కాళేశ్వరం కోసం అహర్నిశలు కష్టపడ్డ హరీష్ రావు .. వెట్ రన్ సక్సెస్ కావటంతో ట్వీట్ కే పరిమితం

కాళేశ్వరం కోసం అహర్నిశలు కష్టపడ్డ హరీష్ రావు .. వెట్ రన్ సక్సెస్ కావటంతో ట్వీట్ కే పరిమితం

కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ వెనుక మాజీ మంత్రి హరీష్ రావు కృషిని ఎవరూ కూడ కాదనలేరు. తెలంగాణలో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు కొనసాగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీష్ రావు అధికారులను పరుగులు పెట్టించారు. రేయనక, పగలనక ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా కొనసాగండంలో హరీష్ రావు కృషి చాలా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద రాత్రి పూట పడుకొని కూడ ఆయన ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు అంటేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ సాధించిన ప్రగతిలో హరీష్ రావు పాత్ర ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ప్రతీదీ షెడ్యూల్ ప్రకారం చేయించి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తన మార్క్ వేశారు హరీష్ రావు . ఇక వెట్ రన్ విజయవంతం కావడంలో కూడ హరీష్ రావు కృషిని పలువురు అధికారులు గుర్తు చేసుకొన్నారు . కానీ హరీష్ మాత్రం ట్వీట్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణలో హరీష్ కు స్థానం కల్పిస్తారా.. భారీ నీటిపారుదల శాఖ ఇస్తారా..

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణలో హరీష్ కు స్థానం కల్పిస్తారా.. భారీ నీటిపారుదల శాఖ ఇస్తారా..

ఇక ప్రస్తుతం ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటానికి అల్లుడు హరీష్ రావును ఎంపీగా ఎన్నికలబరిలోకి దింపుతారని అంతా భావించారు. కానీ అది జరగలేదు . రెండోసారి మంత్రివర్గంలో హరీష్ రావుకు స్థానం కల్పించకపోవటంతో అందరూ అలాగే భావించారు .కేసీఆర్ హరీష్ రావుకు భారీ నీటిపారుదల శాఖా మంత్రిగా మళ్ళీ అవకాశం ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రమే కాదు రాష్ట్రంలోని మిగతా అన్ని నీటి పారుదల ప్రాజెక్ట్ లు నిర్ణీత సమయంలో పూర్తి చేయిస్తారనే భావన హరీష్ రావు విషయంలో నేతల్లో ఉంది. గత టర్మ్‌లో మాదిరిగా మరోసారి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కి భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటే వెట్ రన్ ను హరీష్ రావు నిర్వహించేవాడనే ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మంత్రి పదవిలో లేనందునే హరీష్ రావు వెట్ రన్ విజయవంతం కావడంపై ట్వీట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

హరీష్ విషయంలో కేసీఆర్ వైఖరిలో మార్పు వెనుక అసలు కారణం ఏంటి ?

హరీష్ విషయంలో కేసీఆర్ వైఖరిలో మార్పు వెనుక అసలు కారణం ఏంటి ?

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్న మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు భావిస్తున్నారు . కానీ హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తున్న తీరు మాత్రం హరీష్ కు భారీ నీటి పారుదల శాఖ ఇవ్వటం డౌటే అన్న భావన సైతం కలిగిస్తుంది. మరోసారి ఆయనకు భారీ నీటి పారుదల శాఖ దక్కుతుందా ? అసలు ఆయనకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా ? అసలు హరీష్ విషయంలో కేసీఆర్ వైఖరి ఎందుకు ఇంతగా మారింది? పార్టీకి పరమ విధేయుడిగా , మామ మాట జవదాటని అల్లుడిగా ఉన్న హరీష్ ను కేసీఆర్ ఏం చేస్తారో ? ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ మార్క్ ఎవరూ కాదనలేనిది.

English summary
The first pump in the sixth package of the Kaleshwaram project has been successful. Former major irrigation minister Harish Rao expressed his hatred for the first pump wet run. Harish Rao, the former minister who worked hard for the Kaleshwaram project, tweeted the success of the wet run on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X