వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2018 సెప్టెంబర్‌ నాటికి కాళోజీ కళాక్షేత్రం: బుర్రా వెంకటేశం

వరంగల్‌ నగరానికి తలమానికంగా నిర్మాణం చేపడుతున్న కాళోజీ కళాక్షేత్రాన్ని అన్ని హంగులతో 2018 సెప్టెంబర్‌ 9 కాళోజీ జయంతి వరకు పూర్తి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వరంగల్‌ నగరానికి తలమానికంగా నిర్మాణం చేపడుతున్న కాళోజీ కళాక్షేత్రాన్ని అన్ని హంగులతో 2018 సెప్టెంబర్‌ 9 కాళోజీ జయంతి వరకు పూర్తి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. మంగళవారం సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్టు ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు ఇంఛార్జ్ సురేందర్‌ రావును కళాక్షేత్రం నిర్మాణ పనుల పరోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. కాళోజీ నిర్మాణ పనులు ఇప్పటికే ఆలస్యం జరిగాయని పనులు జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

kaloji kalakshetram will be completed in 2018, says Burra Venkatesh

కాళాక్షేత్రం నిర్మాణానికి రూ. 50 కోట్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. పనులు చేపట్టడంలో అలసత్వం వహించకుండా నాణ్యతా ప్రమాణాలతో అన్ని హంగులతో నిర్మించాలన్నారు. ఇది సాంస్కృతిక, చారిత్రాత్మక, పురాతన ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు నగరానికే ఒక మణికిరీటంగా అద్భుతమైన కట్టడం అవుతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు కాళోజీ కళాక్షేత్రం ప్రగతిని సమీక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వరంగల్‌ నగరానికి అద్భుతమైన కళాఖండంలాంటి కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి ముఖ్యమంత్రి హన్మకొండ పట్టణ నడిబొడ్డున మూడున్నర ఎకరాల భూమి కేయించడంతోపాటు 50 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

English summary
State Tourism, Cultural Secretary Burra Venkatesham said that kaloji kalakshetram will be completed in 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X