• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సింగరేణిలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు.!ప్రత్యేక చొరవ చూపిస్తున్న కల్వకుంట్ల కవిత.!

|

నిజామాబాద్/హైదరాబాద్: సింగరేణిలో కోవిడ్ మహమ్మారి కట్టడికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. సింగరేణి యాజమాన్యంతో పాటు ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మొదలు వైద్య సేవలు, క్వారంటైన్‌ సెంటర్‌ల ఏర్పాటు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వరకు అన్ని దశల్లో కరోనా కట్టడికి కృషి చేసే విదంగా కవిత చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కవిత చేస్తే కరెక్ట్.. సింగరేణిలో కోవిడ్ నియంత్రణ చర్యలకు కల్వకుంట్ల కవిత శ్రీకారం..

కవిత చేస్తే కరెక్ట్.. సింగరేణిలో కోవిడ్ నియంత్రణ చర్యలకు కల్వకుంట్ల కవిత శ్రీకారం..

సింగరేణి కార్మికుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కవిత కార్యాచరణ రూపొందించారు. అందుకోసం సుమారు నాలుగు కోట్ల రూపాయలతో, లక్ష పదివేల రాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు, భారీ ఎత్తున పరీక్షలు, 25 వేల మందికి వ్యాక్సినేషన్, 1,400 బెడ్ లతో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు రంగం సిద్దం చేసారు. ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా ఉన్న కరోనా ప్రత్యేక వార్డులతో పాటు ఐసోలేషన్ సెంటర్లలో అందిస్తున్న వైద్య సేవలతో 9,650 మంది పూర్తిగా కోలుకున్నందుకు కవిత హర్షం వ్యక్తం చేసారు.

కార్మికులకు మెరుగైన వైద్యం.. సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్సీ కవిత..

కార్మికులకు మెరుగైన వైద్యం.. సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్సీ కవిత..

సింగరేణిలో మొత్తం కార్మికులు 44వేలు కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా ఉండి వైద్యం పొందుతున్న కార్మికుల సంఖ్య కేవలం 560 మాత్రమే ఉండడం శుభ పరిణామమని కవిత తెలిపారు. ప్రభుత్వ సహకారంతో సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 27 వేల మందికి వాక్సినేషన్ కూడా పూర్తి చేసినట్టు ఆమె తెలిపారు. మరో 50 వేల మందికి వాక్సినేషన్ చేయించడం కోసం, వాక్సీన్ లను తయారీదారుల నుండే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తున్నామని కవిత పేర్కొన్నారు. ఇందుకోసం తాను ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.

సింగరేణి యాజమాన్యంతో సమన్వయం.. ఎమ్మెల్సీ కవిత చొరవ సూపర్ అంటున్న కార్మిక లోకం..

సింగరేణి యాజమాన్యంతో సమన్వయం.. ఎమ్మెల్సీ కవిత చొరవ సూపర్ అంటున్న కార్మిక లోకం..

కరోనా తీవ్రంగా ఉన్న వారిలో ఇప్పటి వరకు 862 మందికి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలకు గాను, సింగరేణి యాజమాన్యం సుమారు 38 కోట్ల రూపాయలను వెచ్చించింది. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 673 బెడ్ లకు అదనంగా, 43 లక్షల రూపాయలతో మరో 755 బెడ్ లను ఏర్పాటు చేశారు.
సుమారు 80 లక్షల రూపాయలతో వివిధ రకాల మందులు, ఆక్సిజన్ మీటర్ వంటి 18 రకాల వస్తువులు గల కిట్లను కొనుగోలు చేసి హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి అందజేస్తున్నట్టు కవిత వివరించారు.సింగరేణి వ్యాప్తంగా ఉన్నఆసుపత్రులకు అవసరమై ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఫెవి పెరావిర్ వంటి మందులను 5.55 కోట్ల రూపాయలతో సమకూర్చడం జరిగిందని తెలిపారు.

  Prabhas in Godavarikhani for shooting of ‘Salaar’
  సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. తగ్గేది లే అంటున్న కవిత..

  సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యం.. తగ్గేది లే అంటున్న కవిత..

  అంతే కాకుండా ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు, సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఐదు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు, 1.18 కోట్ల రూపాయలతో 370 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసొనట్టు తెలిపారు కవిత. కోవిడ్ వార్డులకు అవసరమైన 20 మంది అదనపు డాక్టర్లను, 250 మంది సిబ్బందిని కూడా కాంట్రాక్టు పద్ధతిన నియమించుకున్నట్టు కవిత తెలిపారు. అంతే కాకుండా కోవిడ్ పేషెంట్లకు సింగరేణి సంస్థ పౌష్టిక ఆహారం అందిస్తోందని, దీని కోసం 1.50 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు వెచ్చించిందని, వీటితోపాటు శానిటేషన్ లిక్విడ్, మాస్కులు,హ్యాండ్ శానిటైజర్లు వైద్యులకు కావలసిన పీపీఈ కిట్లు, మాస్కులు వంటివి అందజేసామని కవిత తెలిపారు.

  English summary
  It seems that mlc Kalwakuntla Kavitha is creating a special activity for the Kovid pandemic raising in Singareni. Kavitha seems to be taking the initiative to work towards corona raising at all stages, especially medical services,starting with Kovid‌ diagnostic tests.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X