వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి బాబు, మధ్యవర్తిగా కంభంపాటి: ఇలాగైతే పార్టీలో ఉండలేను.. చెప్పేసిన రేవంత్

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు.

'అంతా తూచ్, రాహుల్ గాంధీని కలవలేదు': రేవంత్ చేరికపై కాంగ్రెస్ మెలిక!'అంతా తూచ్, రాహుల్ గాంధీని కలవలేదు': రేవంత్ చేరికపై కాంగ్రెస్ మెలిక!

టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్ రావును అధినేత రంగంలోకి దింపారని తెలుస్తోంది. కంభంపాటి.. బుధవారం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ ముందు రేవంత్ రెడ్డి 'కీలక' ప్రతిపాదనలు, దూకుడుకు చంద్రబాబు అడ్డుకట్టకాంగ్రెస్ ముందు రేవంత్ రెడ్డి 'కీలక' ప్రతిపాదనలు, దూకుడుకు చంద్రబాబు అడ్డుకట్ట

పార్టీ మారుతారని అనుకోవడం లేదు

పార్టీ మారుతారని అనుకోవడం లేదు

రేవంత్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో కంభంపాటి ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అనంతరం కంభంపాటి మీడియాతో మాట్లాడారు. ఆయన పార్టీ మారుతారని తాము ఏమాత్రం అనుకోవడం లేదని చెప్పారు. అయితే తాను కలిసింది మాత్రం వ్యక్తిగతంగానే అని చెప్పారు.

 కలిసింది వ్యక్తిగతం అన్నప్పటికీ

కలిసింది వ్యక్తిగతం అన్నప్పటికీ

తాను కలిసింది వ్యక్తిగతంగానే అని కంభంపాటి చెప్పినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో ఆయన రేవంత్ రెడ్డిని కలిసి ఉంటారనే చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీని కలిసిన నేపథ్యంలో బుజ్జగింపుల కోసం చంద్రబాబు పంపించి ఉంటారని అంటున్నారు.

 అలా అయితే పార్టీలో ఉండలేను

అలా అయితే పార్టీలో ఉండలేను

కాగా, అంతకుముందే చంద్రబాబుకు పరోక్షంగా, ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి పార్టీలో ఉండలేనని చెప్పినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా చెబుతూ ముందుకు వెళ్తున్నారని నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అడ్డుకోవడమూ రేవంత్ ఆగ్రహానికి కారణం

అడ్డుకోవడమూ రేవంత్ ఆగ్రహానికి కారణం

తన దూకుడును అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, పార్టీ నేతల ఫిర్యాదు వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తికి లోనైన రేవంత్ రెడ్డి.. ఇలా అయితే తాను పార్టీలో ఉండలేనని చంద్రబాబుకు సూటిగా చెప్పారని తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ కేసీఆర్ పైన పోరాడుతుంటే అక్కడ పయ్యావుల తెలంగాణ సీఎంతో భేటీ కావడం తమకు నష్టం కలిగిస్తుందని చంద్రబాబుతో రేవంతే చెప్పారని అంటున్నారు.

ఎర్రబెల్లి దయాకర రావు వంటి నేతలు వెళ్లిపోయారు

ఎర్రబెల్లి దయాకర రావు వంటి నేతలు వెళ్లిపోయారు

తెలంగాణలో టిడిపి అంటే రేవంత్ రెడ్డి మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి కారణంగానే ఎర్రబెల్లి దయాకర రావు వంటి నేతలు టిడిపిని వీడారని, పలువురు నేతలు పార్టీని వీడినా రేవంత్ అంతా తానుగా వ్యవహరిస్తున్నారని నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.

రేవంత్ వల్లనే పార్టీకి దూరమయ్యారు, అవుతున్నారు

రేవంత్ వల్లనే పార్టీకి దూరమయ్యారు, అవుతున్నారు

దీనిపై చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి క్లాస్ పీకారు. ఇటీవల పొత్తు విషయమై కూడా హద్దులు దాటవద్దని హెచ్చరించారు. ఓ వైపు నేతలు పార్టీని వీడుతుంటే, మరోవైపు అంతా తానే అన్నట్లు రేవంత్ దూకుడుగా వ్యవహరించడం మిగతా నేతలకు నచ్చలేదు. ఓ విధంగా రేవంత్ వల్లే కొందరు సీనియర్లు పార్టీకి దూరమవుతున్నారని నేతలు ఆందోళన చెందుతున్నారట.

English summary
Former TD MP Kambhampati Rammohan Rao on Wednesday has met Telangana Telugu Desam Party leader Revanth Reddy on party changing issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X