వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంచర్లకే నల్గొండ టిఆర్ఎస్ టిక్కెట్టు: దుబ్బాకకు కార్పోరేషన్ ఛైర్మెన్, కోమటిరెడ్డికి ఇబ్బందేనా?

నల్గొండ అసెంబ్లీ నియోజకర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి,. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్ ఇప్పటి నుండే వ్యూహలు రచిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నల్గొండ: నల్గొండ అసెంబ్లీ నియోజకర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి,. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్ ఇప్పటి నుండే వ్యూహలు రచిస్తోంది.

వారిద్దరు కలిశారు: ''సుఖేందర్‌రెడ్డే నా గురువు, కానీ, కోమటిరెడ్డిపై వ్యతిరేకతతోనే చేరలేదు''వారిద్దరు కలిశారు: ''సుఖేందర్‌రెడ్డే నా గురువు, కానీ, కోమటిరెడ్డిపై వ్యతిరేకతతోనే చేరలేదు''

రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాకుండా టిఆర్ఎస్‌లో చేరారు. నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని కంచర్ల భూపాల్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోయింది. దీంతో కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం నాడు టిఆర్ఎస్‌లో చేరారు.

రేవంత్‌కు ట్విస్ట్ ఇచ్చిన కంచర్ల: కోమటిరెడ్డే కారణమా, కారెక్కుతారా?రేవంత్‌కు ట్విస్ట్ ఇచ్చిన కంచర్ల: కోమటిరెడ్డే కారణమా, కారెక్కుతారా?

1999 ఎన్నికల నుండి నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కంచర్ల భూపాల్‌రెడ్డిపైనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు.

రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?

2014 ఎన్నికల సమయంలో టిడిపి టిక్కెట్టు కంచర్ల భూపాల్‌రెడ్డికి దక్కలేదు. ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. అయితే దీంతో కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ స్థానం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు.ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కంచర్ల భూపాల్‌రెడ్డి టిడిపిన వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

రేవంత్ ఎపిసోడ్: టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌, నేతలకు బంపరాఫర్లురేవంత్ ఎపిసోడ్: టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌, నేతలకు బంపరాఫర్లు

 కంచర్ల భూపాల్‌రెడ్డికి లైన్‌క్లియర్

కంచర్ల భూపాల్‌రెడ్డికి లైన్‌క్లియర్

2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ టిక్కెట్టు కంచర్ల భూపాల్‌రెడ్డి దక్కనుంది. నల్గొండ అసెంబ్లీ నియోజకర్గ ఇంచార్జీగా ఇప్పటివరకు కొనసాగిన దుబ్బాక నర్సింహ్మరెడ్డి స్థానంలో కంచర్ల భూపాల్‌రెడ్డికి ఈ బాద్యతలను టిఆర్ఎస్ నాయకత్వం కట్టబెట్టింది. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి దుబ్బాక నర్సింహ్మరెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఓడించాలంటే బలమైన అభ్యర్థి కావాలని టిఆర్ఎస్ నాయకత్వం భావించింది. దరమిలా కంచర్ల భూపాల్‌రెడ్డిని టిఆర్ఎస్‌లో చేర్చుకొంది.

 దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పోరేషన్ పదవి

దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పోరేషన్ పదవి

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇంచార్జీగా ఇప్పటివరకు కొనసాగిన దుబ్బాక నర్సింహ్మరెడ్డికి ఆ బాధ్యతల నుండి తప్పించారు. అంతేకాదు దుబ్బాకకు కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని అప్పగించాలని టిఆర్ఎస్ నాయకత్వం భావించింది. ఈ మేరకు కంచర్ల భూపాల్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కెటిఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు.కంచర్ల భూపాల్‌రెడ్డి కోరుకొన్నట్టుగానే ఇంచార్జీ బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది.

 కోమటిరెడ్డికి ఇబ్బందులేనా?

కోమటిరెడ్డికి ఇబ్బందులేనా?

2019 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి జరిగే ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి. కంచర్ల భూపాల్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.2019 ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేయనున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల భూపాల్‌రెడ్డి పోటీ చేస్తారు. టిడిపి అభ్యర్థి ఎవరనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది. గతంలో ఈ స్థానంలో సిపిఎం విజయం సాధించింది. ప్రధానంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ముఖాముఖీ పోటీ జరిగే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

 దుబ్బాక, కంచర్ల భూపాల్‌రెడ్డి వర్గీయులు కలిసేనా?

దుబ్బాక, కంచర్ల భూపాల్‌రెడ్డి వర్గీయులు కలిసేనా?

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కన్పిస్తోంది. కంచర్ల భూపాల్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.దుబ్బాక నర్సింహ్మరెడ్డి అనుచరులు కూడ కంచర్ల భూపాల్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దుబ్బాక నర్సింహ్మరెడ్డికి కార్పోరేషన్ చైర్మెన్ బాధ్యతలను అప్పగించనున్నారు. కంచర్ల భూపాల్‌రెడ్డి దుబ్బాక నర్సింహ్మరెడ్డి వర్గీయులను కలుపుకొనిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అయితే ఇద్దరు నేతల మధ్య రాజీ నెలకొన్నందున క్షేత్రస్థాయిలో కూడ అదే రకమైన పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

English summary
With Kancharla Bhupal Reddy and his brother Krishna Reddy joining the TRS from TDP in Nalgonda district, the political landscape of the district is expected to witness some changes in the coming days.As Kancharla Bhupal Reddy is considered a mass leader, and also has got considerable following among youth in the Nalgonda Assembly constituency, his entry into the Pink party is likely to improve the electoral fortunes for TRS in the segment, at present ruled by the Congress MLA Komatireddy Venkat Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X