హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉదయం రేవంత్, సాయంత్రం మంత్రితో టీడీపీ కంచర్ల చర్చలు! ఆ నేత డైలమా

టీడీపీ నల్గొండ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తాము ఆయన వెంటే ఉంటామని కొందరు అనుచరులు చెబుతుండగా, మరికొందరు టీడీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

నల్గొండ: టీడీపీ నల్గొండ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు. తాము ఆయన వెంటే ఉంటామని కొందరు అనుచరులు చెబుతుండగా, మరికొందరు టీడీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. తామంతా కంచర్లతో ఉంటామని పలువురు నాయకులు చెప్పారు.

కోమటిరెడ్డి చేసిందేం లేదు, కంచర్లతోనే మేమంతా

కోమటిరెడ్డి చేసిందేం లేదు, కంచర్లతోనే మేమంతా

నాలుగు పర్యాయాలు గెలిచిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో కంచర్ల చేతిలో ఓడిపోతున్నారని చెప్పారు. కంచర్ల నాయకత్వంలో తెరాసని నల్గొండ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేస్తామన్నారు.

కంచర్లది స్వార్థ రాజకీయం

కంచర్లది స్వార్థ రాజకీయం

మరోవైపు, కంచర్లపై టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. టీడీపీలో అనేక పదవులు అనుభవించి స్వార్థ రాజకీయాల కోసం కంచర్ల అధికార టీఆర్ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఆయన వెంట అనుచరులు తప్ప ఎవరూ వెళ్లడం లేదన్నారు.

రేవంత్‌తో ఉదయం, మంత్రితో సాయంత్రం

రేవంత్‌తో ఉదయం, మంత్రితో సాయంత్రం


కంచర్ల భూపాల్ రెడ్డి ఉదయం రేవంత్ రెడ్డితో, సాయంత్రం మంత్రి జగదీశ్ రెడ్డితో చర్చలు జరిపాడని, చివరకు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ధ్వజమెత్తారు. కంచర్లది రాజకీయ వ్యభిచారమన్నారు. ఆయనకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

డైలమాలో టీడీపీ నేత

డైలమాలో టీడీపీ నేత

టీడీపీ నల్గొండ టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిర్యాల యాదగిరి పార్టీ మారే విషయంలో డైలమాలో ఉన్నారని సమాచారం. కంచర్ల టీడీపీని వీడి తెరాసలో చేరుతున్న నేపథ్యంలో యాదగిరి ఎటు వెళ్లాలి, టీడీపీలోనే ఉండాలా అనే విషయమై సందిగ్ధంలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనతో అటు కంచర్ల వర్గీయులు, మరోవైపు టీడీపీ చర్చలు జరుపుతోంది.

English summary
Telugu Desam Party leader Kancharla Bhupal Reddy will join TRS along with his followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X