హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఫ్జల్‌గురు ఆదర్శం కాదు: కన్నయ్య, చెప్పు విసిరే యత్నం, గందరగోళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: తమకు అఫ్జల్ గురు ఆదర్శం కాదని, రోహిత్ వేముల ఆదర్శమని జెఎన్‌యు విద్యార్థి కన్నయ్య కుమార్ గురువారం నాడు అన్నారు. రోహిత్ వేములకు న్యాయం జరిగే వరకు పోరాడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తాను అందుకే హైదరాబాద్ వచ్చానని చెప్పారు.

ఇదిలా ఉండగా, కన్నయ్య కుమార్ తెలుగు రాష్ట్రాల పర్యటన వివాదాల మధ్య సాగుతోంది. బుధవారం హెచ్‌సియుకు వచ్చిన అతను ఈ రోజు (గురువారం) విజయవాడకు వెళ్లనున్నారు. గవర్నర్ పేట ఐవీ ప్యాలెస్‌లో జరగనున్న సభలో కన్నయ్య కుమార్ మాట్లాడనున్నారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరాలని భావిస్తున్నారు. అయితే, దీనికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. సభకు అనుమతి కోరలేదని చెప్పారు. విద్యార్థి సంఘాల పైన పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు, కన్నయ్యను రానిచ్చేది లేదని బిజెవైఎం, ఏబీవీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కడ కన్హయ్యను అడ్డుకున్నా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వామపక్ష నేతలు ప్రతిగా హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్నయ్య సభ జరిపి తీరుతామని సిపిఐ, సిపిఎం నేతలు వెల్లడించారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత

సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద గురువారం కన్నయ్య కుమార్ ప్రసంగం సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన మాటడ్లాడుతుండగా.. అక్కడకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రసంగం అపాలన్నారు. చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు.

వారు కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ఓ ఏబీవీపీ విద్యార్థిని పట్టుకొని చితకబాదారు. కన్నయ్య వద్దని చెప్పినప్పటికీ వారు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది.

అనంతరం పోలీసులు ఏబీవీపీ విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం కన్నయ్య మాట్లాడుతూ... ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. నాకు తెలుగు మాట్లాడటం రాదని చెప్పారు. మనది గాంధేయవాద దేశమని, వారిని నిరనస తెలపనీయండని చెప్పారు.

జెఎన్‌యులో చెంపదెబ్బ కొట్టిన వాళ్లమే తాము వదిలేశామని చెప్పారు. ప్రచారం కోసమే తన పైన ఇలా దాడికి వస్తున్నారన్నారు. దేశంలో అంతరాల్ని తగ్గించేందుకే తమ పోరాటం అని చెప్పారు. కాగా, కన్నయ్య కుమార్‌ను అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థులు నరేష్ కుమార్, పవన్ కుమార్ రెడ్డిలు అని తెలుస్తోంది. వారు రాజేంద్రనగర్ ఏబీవీపీ శాఖ విద్యార్థులని సమాచారం. వీరు కన్నయ్య ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గందరగోళంగా మారింది.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

హెచ్‌సియులో ఆందోళనల నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తత బుధవారం కొనసాగింది. కన్నయ్య కుమార్ హెచ్‌సీయూ పర్యటనను పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

బోధనేతర సిబ్బంది సేవల్ని నిలిపివేయడంతో విద్యార్థులు వంటా వార్పునకు ఉపక్రమించగా పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

సాయంత్రం వర్సిటీకి వచ్చిన కన్నయ్యకు అనుమతి నిరాకరించడంతో ఆయన అక్కడే ప్రసంగించి వెనుదిరిగారు. మంగళవారం అదుపులోకి తీసుకున్న 25 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు అధ్యాపకుల్ని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

సైబరాబాద్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ శశిధర్‌రెడ్డి, మాదాపూర్‌ డీసీపీ కార్తికేయ నేతృత్వంలో పోలీసులు బుధవారం వర్సిటీ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

వర్సిటీ గుర్తింపు కార్డులున్న ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే లోపలికి పంపించారు. మీడియా ప్రతినిధులు, రాజకీయ, ప్రజాసంఘాల నేతలకు వర్సిటీలోకి అనుమతి లేదంటూ రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేశారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

మీడియానూ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో జాతీయ మీడియా ప్రతినిధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎంపీ అజీజ్ పాషా వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

బుధవారం ఉదయం కన్నయ్య కుమార్ విమానంలో శంషాబాద్‌కు చేరుకున్నారు. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

అక్కణ్నుంచి కన్నయ్య కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌కు చేరుకున్నారు. సాయంత్రం అక్కడికి వచ్చిన రోహిత్‌ తల్లి రాధికకు కన్నయ్య పాదాభివందనం చేశారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

సాయంత్రం ఆరు గంటల సమయంలో విశ్వవిద్యాలయానికి చేరుకున్న కన్నయ్యను పోలీసులు ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్నారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

ఏబీవీపీ కార్యకర్త ఒకరు 'కన్నయ్య గో బ్యాక్' అంటూ నినదించడంతో పోలీసులు అతడిని వెంటనే వెనక్కి పంపేశారు. తర్వాత కన్నయ్య అక్కడే కాసేపు ప్రసంగించి వెనుదిరిగారు. రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు రాజా కొంతసేపు అక్కడే నిరసన కొనసాగించారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద గురువారం కన్నయ్య కుమార్ ప్రసంగం సమయంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

ఆయన మాటడ్లాడుతుండగా.. అక్కడకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రసంగం అపాలన్నారు. చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

వారు కన్నయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ఓ ఏబీవీపీ విద్యార్థిని పట్టుకొని చితకబాదారు.

కన్నయ్య కుమార్

కన్నయ్య కుమార్

కన్నయ్య వద్దని చెప్పినప్పటికీ వారు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది.

English summary
Kanhaiya not allowed entry into University of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X