వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ వ్యక్తి చేసిన తప్పు: శ్రీనివాస్‌తో స్నేహం గుర్తు చేసుకున్న అలోక్, చప్పట్లు

కన్సాస్ కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కాగానే నేరుగా ఇదే ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల సంస్మరణార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేతి కర్రల సాయంతో వచ్చారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్: కన్సాస్ కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కాగానే నేరుగా ఇదే ఘటనలో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల సంస్మరణార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేతి కర్రల సాయంతో వచ్చారు.

<strong>శ్రీనివాస్ కూచిభొట్ల మృతిపై వైట్‌హౌస్, ట్రంప్! ఇప్పుడేమంటావ్</strong>శ్రీనివాస్ కూచిభొట్ల మృతిపై వైట్‌హౌస్, ట్రంప్! ఇప్పుడేమంటావ్

ఈ సందర్భంగా శ్రీనివాస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఓలేత్ నగరంలోని బాల్ కాన్ఫరెన్సు సెంటర్లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో మాట్లాడారు.

కల అయితే బాగుండు

కల అయితే బాగుండు

ఇదంతా ఓ కల అయితే బాగుండు అనిపిస్తోందని అలోక్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. అసలు తాను ఇక్కడకు రావడానికి శ్రీనివాస్ కూచిభొట్ల కారణం అని చెప్పారు. అథడు కూడా ఇప్పుడు తనతో ఉండి ఉంటే బాగుండుననిపిస్తోందన్నారు.

తొమ్మిదేళ్లుగా స్నేహితులం

తొమ్మిదేళ్లుగా స్నేహితులం

తొమ్మిదేళ్ల నుంచి తామిద్దరం స్నేహితులమని అలోక్ చెప్పారు. ఇద్దరం కలిసే ఉద్యోగానికి వెళ్లేవాళ్లమని, తిరిగి వచ్చేటప్పుడు సరదాగా ఉండేవాళ్లమని చెప్పారు. అమెరికాలో కష్టంగా ఉందని లేదా తిరిగి వెళ్లిపోదామని ఎప్పుడు కూడా చెప్పలేదన్నారు.

నేను కారు కొనే వరకు ఆగాడు..

నేను కారు కొనే వరకు ఆగాడు..

గత ఆరు నెలలుగా ప్రతిరోజు తన అపార్టుమెంట్ వద్దకు వచ్చి తన కారులో ఎక్కించుకొని కార్యాలయానికి తీసుకు వెళ్లేవాడని అలోక్ చెప్పారు. తాను కారు కొనే వరకు కూడా తను కొనకుండా ఆగాడని చెప్పారు. అసలు తాను కారు కొన్నప్పటికీ దానిని బయటకు తీయాల్సిన అవసరం రాలేదని చెప్పారు.

ఓ వ్యక్తి చేసిన తప్పే.. హాలులో చప్పట్లు

ఓ వ్యక్తి చేసిన తప్పే.. హాలులో చప్పట్లు

పిచ్చి ఆవేశంలో ఓ వ్యక్తి చేసిన పనికి తన ప్రాణ స్నేహితుడిని కోల్పోయానని అలోక్ చెప్పారు. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చిందన్నారు. ఇది ఓ వ్యక్తి చేసిన ఘటనే తప్ప.. కాన్సాస్ ప్రాంత అసలైన స్ఫూర్తిని మాత్రం దెబ్బతీయలేరన్నారు. ఈ వ్యాఖ్యలతో హాలులో చప్పట్లు మార్మోగాయి.

కాపాడేందుకు ఇద్దరు వచ్చారు

కాపాడేందుకు ఇద్దరు వచ్చారు

కాల్పులు జరిగిన రోజు తమను కాపాడేందుకు వచ్చిన వారు ఒక్కరు కాదని.. ఇద్దరు అని అలోక్ రెడ్డి చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, కానీ ఆయన తాను వేసుకున్న షర్ట్ తీసి, తనకైన బుల్లెట్ గాయం నుంచి అవుతున్న రక్తస్రావాన్ని ఆపడానికి కట్టుకట్టారని చెప్పారు. ఆయన అలా కట్టకపోతే తీవ్ర రక్తస్రావం కారణంగా ప్రాణాలు పోయేవని చెప్పారు. ఈ విషయాన్ని తనకు అంబులెన్సులో ఉన్న వాళ్లు చెప్పారన్నారు.

నేను, నా స్నేహితుడు కోరుకునేది ఇదే

నేను, నా స్నేహితుడు కోరుకునేది ఇదే

అమెరికన్లంతా సహనం కలిగి ఉండాలని, మానవత్వం పట్ల గౌరవం ఉండాలని.. తాను ఎక్కువ ఏమీ అడగట్లేదని, తన స్నేహితుడు కూడా ఇదే కోరుకుంటాడని అలోక్ రెడ్డి చెప్పారు.

English summary
Alok Reddy, who was injured in the shooting, remembers his nine year friendship with Srinivas Kuchibhotla.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X