వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ క్రిష్ట ద‌గ్గ‌ర ట్రాఫిక్ స‌మ‌స్య‌.. మొరాయించిన క‌ర్ణాట‌క‌ ఎమ్మెల్యేల బ‌స్సు

|
Google Oneindia TeluguNews

Recommended Video

క‌ర్ణాట‌క‌ ఎమ్మెల్యేల బ‌స్సు వల్ల తాజ్ క్రిష్ట ద‌గ్గ‌ర ట్రాఫిక్ స‌మ‌స్య‌

హైద‌రాబాద్ తాజ్ క్రిష్ణ కి త‌ర‌లి వ‌చ్చిన క‌ర్ణాట‌క ఎమ్మెల్యేల ప‌రిస్థితి ఏసి గ‌దుల్లో చ‌ల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి బ‌య‌ట జ‌నాల‌కు మాత్రం చిర్రెత్తుకొచ్చింది. బ‌య‌ట జ‌నాల‌కు, తాజ్ క్రిష్ణ‌లో ఉన్న ఎమ్మెల్యేల‌కు ఏంటి సంబందం అనుకుంటున్నారా.. ఐతే ఈ స్టోరీ చూడండి. క‌ర్ణాట‌క నుండి ఎమ్మెల్యేల‌ను తీసుకుని వ‌చ్చిన మొద‌టి వోల్వో బ‌స్సు రోడ్ నంబ‌ర్ 12లోని ఎంట్రెన్స్ గేట్ నుండి లోప‌లికి ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేసింది. ప్ర‌ధాన గేట్ కాస్త ఎత్తులో ఉండ‌డంతో బ‌స్సు వెన‌క బాగం మొత్తం రోడ్డుకు అంటుకుపోయింది.

దీంతో వెన‌క చ‌క్రాల‌కు రోడ్ గ్రిప్ లేక ఎంత ఎక్ప‌లేట‌ర్ రైస్ చేసినా చ‌క్రాలు తిరుగుతున్నాయి త‌ప్ప బ‌స్సు ముందుకు క‌ద‌ల‌ని ప‌రిస్తితి నెల‌కొంది. బ‌స్సు స‌రిగ్గా రోడ్డుకు మ‌ద్య‌లో ఆగి ఉండ‌డంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంబించిపోయింది. రోడ్ నంబ‌ర్ ఒక‌టి నుండి వ‌చ్చే వాహ‌నాలు, ఎన్కెఎమ్ హోట‌ల్ నుండి రోడ్ నంబ‌ర్ 12వైపు వ‌చ్చే వాహ‌న దారులకు చుక్క‌లు క‌నిపించాయి.

kantataka mlas bus tour caused traffic jam in hyderabad

ఉద‌యం ప‌దిన్న‌ర ప్రాంతంలో ఆగిపోయిన బ‌స్సును మ‌ద్యాహ్నం దాటినా క‌దిలించ లేక పోవ‌డంతో వాహ‌న దారులు అనేక ర‌కాలుగా ఇబ్బందులు ప‌డ్డారు. బ‌స్సు గేట్ కి రోడ్డుకి మ‌ద్య‌లో ఆగిపోవ‌డంతో ఇటు హోట‌ల్ లోప‌నికి వ‌చ్చే వాహ‌నాల‌కు, అటు రోడ్డుమీద వెళ్లున్న వాహ‌నదారుల‌కు స‌మ‌స్య‌గా మారింది. ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే రోడ్డులో ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదురైతే వెంట‌నే ప‌రిష్క‌రించే సామ‌ర్థ్యం ఇంకా న‌గ‌ర సోలీసుల‌కు లేదా అని వాహ‌న‌దారులు విసుక్కున్న‌ట్టు క‌నిపించింది.

English summary
kantataka mla's bus tour caused traffic jam in hyderabad. mla's bus suddenly stopped in main entrance gate and it could'nt move either front or back. thats why in road 12 the passengers struggled a lot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X