చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరీ ఐపిఎస్ సఫీర్ కరీం: ఎలా పట్టుబడ్డాడు, భార్య ఎలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేరళలోని ఎర్నాకులం ప్రాంతంలో గల అలువాకు చెందిన సఫీర్ కరీం 2015లో తన రెండో ప్రయత్నంలో యుపిఎస్‌సి పరీక్షల్లో 112వ ర్యాంకు సాధించి ఐపిఎస్‌గా ఎంపికయ్యాడు. ఆయన ఎలక్ట్రానిక్ ఇంజనీరు. కరీంస్ ఐఎఎస్ పేరిట ఆయన సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాడు.

Recommended Video

IPS Officer Arrested for Cheating In UPSC Mains Examination | Oneindia Telugu

దాని శాఖలు కొచ్చిలోనూ తిరువనంతపురంలోనూ ఉన్నాయి. శనివారం జరిగిన పరీక్షలోనూ అతను కాపీ చేసి ఉంటాడనే అనుమానంతో నిఘా విభాగం అధికారులు నిఘా పెట్టారు. ఆయన భార్య జాయిస్‌పై హైదరాబాదులో కూడా నిఘా పెట్టారు.

కరీం 'పెద్ద జాదూ': ఇలా హైటెక్ కాపీయింగ్.., సురేష్ గోపీ స్ఫూర్తి, విస్తుపోవాల్సిందే!కరీం 'పెద్ద జాదూ': ఇలా హైటెక్ కాపీయింగ్.., సురేష్ గోపీ స్ఫూర్తి, విస్తుపోవాల్సిందే!

పరీక్ష గదిలోకి ప్రవేశించే సమయంలో అతను పోలీసులకు టోకరా ఇచ్చారు. ట్రోజర్ జేబులో ఉన్న వాలేను, సెల్‌ఫోన్‌ను తీసి వారికి ఇచ్చి క్షమాపణ చెప్పాడు. కారులో పెట్టి రావడం మరిచిపోయానని చెప్పాడు. అయితే, అలా టోకరా ఇచ్చి కాపీయింగ్‌కు తాను చేసుకున్న ఇతర ఏర్పాట్లను కనిపెట్టకుండా జాగ్రత్త పడ్డాడు.

ఇలా దాచుకున్నాడు..

ఇలా దాచుకున్నాడు..

ఫోన్‌ను, వైర్‌లెస్ ఇయర్ పీసెస్‌ను సాక్స్‌లో దాచుకున్నాడు. మీనియేచర్ కెమెరాను చొక్కాలో దాచిపెట్టుకున్నాడు. మూడు గంటల పాటు జరిగే పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఇరవై నిమిషాల తర్వాత ఇంటిలిజెన్స్ అధికారులు పరీక్ష గదిలోకి ప్రవేశంచి కరీంను సోదా చేశారు. సీటు కింద దాచిన సెల్‌ఫోన్‌ను, కెమెరాను, ఇయర్ పీసెస్‌ను స్వాధీనం చేసుకున్నారు.

జాయి‌స్‌తో వివాహం ఇలా.

జాయి‌స్‌తో వివాహం ఇలా.

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి కరీం 2015లో కేరళలో కోచింగ్ సెంటర్ పెట్టాడు. అందులో ఆర్థిక శాస్త్రం బోధించేందుకు జాయిస్ చేరింది. ఆ సమయంలో వారిద్దరికి పరిచయమైంది. ఆ తర్వాత 2106లో వారిద్దరు వివాహం చేసుకున్నారు. హైదరాబాదులోని లా ఎక్సలెన్స్ ఐఎఎస్ కోచింగ్ సెంటర్లో ఆమె విజిటింగ్ ఫ్యాకల్టీ మెంబర్‌గా పనిచేస్తోంంది. ఈ సంస్థలో నుంచే భర్తకు జవాబులు అందిస్తూ ఆమె పట్టుబడింది. సంస్థ డైరెక్టర్, కరీం మిత్రుడు పి. రాంబాబును కూడా పోలీసులు అరెస్టు చేశారు.

క్యాట్‌లో టాపర్....

క్యాట్‌లో టాపర్....

క్యాట్ బిజినెస్ స్కూల్ ప్రవేశ పరీక్షలో కరీం టాపర్‌గా నిలిచాడు. కరీం ఇటీవల ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. దానివల్ల పోలీసు ఫిట్నెస్ పరీక్షల్లో పాసయ్యే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఐఎఎస్ సాధిస్తే తప్ప భవిష్యత్తు ఉండదని భావించాడు. దాంతో ఐఎఎస్ పరీక్షకు కూర్చుని హైటెక్ కాపీయింగ్‌తో పట్టుబడ్డాడు.

స్టేషన్ ఇంచార్జీగా....

స్టేషన్ ఇంచార్జీగా....

తన శిక్షణా కాలంలో కరీం సఫీర్ ప్రస్తుతం తిరునెల్వేలి జిల్లా నంగనేరి సబ్ డివిజన్ స్టేషన్ ఇంచార్జీగా ఉన్నారు. అతను ప్రొబెషన్‌లో ఉన్నాడు. దానివల్ల ఆయనను డిస్మిస్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎగ్మోర్‌లోని ప్రెసిడెన్సీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జనరల్ స్టడీస్ పరీక్ష రాస్తుండగా అతన్ని ఇంటిలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.

English summary
Safeer Karim, who hails from Ernakulam in Kerala, was serving as station-in-charge at Nanguneri sub division in Tirunelveli district during his training period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X