వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6నెలలపాటు రేప్: హైదరాబాద్ పోలీసుల ముందు బాలీవుడ్ నిర్మాత లొంగుబాటు

హసుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ హైదరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన కరీం మొరానీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ హైదరాబాద్ పోలీసుల ముందు శుక్రవారం రాత్రి లొంగిపోయాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన కరీం మొరానీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మత్తుమందిచ్చి రేప్..

మత్తుమందిచ్చి రేప్..

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 'రా.వన్', 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్', 'దిల్ వాలే' వంటి హిందీ చిత్రాలను నిర్మించారు బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ. అయితే, తన సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి 2015లో బీబీఎం విద్యార్థినిని ట్రాప్ చేశాడు. అదే ఏడాది జూలైలో ఆమెకు మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బెదిరింపులకు పాల్పడి... 6నెలలపాటు

బెదిరింపులకు పాల్పడి... 6నెలలపాటు

ఆ సందర్భంగా తీసిన అభ్యంతరకర ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆరు నెలలపాటు ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, కరీం మొరానీకి అండర్ వరల్డ్ మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చంపుతానంటూ..

చంపుతానంటూ..

అనంతరం ఆమెను చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు తెలిపింది. దీంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. బెయిల్‌పై బయటకు వచ్చి, ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో

సుప్రీం ఆగ్రహం నేపథ్యంలో

ఈ క్రమంలో నిందితుడు కరీం మోరానీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. అతడి బెయిల్‌ను రద్దు చేసింది. వెంటనే కోర్టులో లొంగిపోవాలని అతడ్ని ఆదేశించింది. దీంతో కీరం మోరానీ హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

English summary
Bollywood producer Karim Morani surrendered at Hayathnagar police station in a rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X