• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లోక్‌సభ సమరశంఖం.. కరీంనగర్ సెంటిమెంట్ గా తొలి సమావేశం.. కేటీఆర్ మార్క్

|

కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమైంది. 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా గులాబీ దండుకు కలిసొచ్చిన కరీంనగర్ నుంచి సన్నాహక సమావేశాలకు సిద్ధమైంది. పార్లమెంటరీ ఎన్నికల వేళ ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

లోక్‌సభ సమరం.. క్లీన్ స్వీప్ పై కన్ను

అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. పంచాయతీ పోరు సమసిపోయింది. ఇక మిగిలిందల్లా లోక్‌సభ ఎన్నికలే. అటు అసెంబ్లీ ఎన్నికల్లోను, ఇటు పంచాయతీ పోరులోనూ కారు హవానే కొనసాగింది. దాంతో పార్లమెంటరీ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది టీఆర్ఎస్ పార్టీ. ఫెడరల్ ఫ్రంట్ తో దేశరాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించాలనుకుంటున్న గులాబీ బాస్ కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్టుగా.. లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్నది ఆ పార్టీ అంతరంగంగా కనిపిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంటరీ స్థానాలకు గాను 16 స్థానాలను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు గులాబీ పెద్దలు.

ఎంపీ ఎన్నికల వేడి.. బీజేపీ స్ట్రాటజీ షురూ.. ఇవాళ నిజామాబాద్ కు అమిత్ షా

కలిసొచ్చిన గడ్డ కరీంనగర్ నుంచే..!

కలిసొచ్చిన గడ్డ కరీంనగర్ నుంచే..!

ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వంలో కీ రోల్ పోషించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు కారు రథసారధి కేసీఆర్. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరో రెండు నెలల సమయమున్నా కూడా ఇప్పటినుంచే దృష్టి కేంద్రీకరించారు. అందులోభాగంగా పార్లమెంటరీ సెగ్మెంట్ స్థాయి సన్నాహాక సమావేశాలను బుధవారం (06.03.2019) నుంచి ప్రారంభించబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావం మొదలు.. పార్టీకి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్న ఈ సమావేశాన్ని జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్దఎత్తున పార్టీశ్రేణులను తరలించేందుకు తలమునకలైంది. కటౌట్లు, హోర్డింగులతో నగరమంతా గులాబీమయంగా మారింది.

మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తుల సెగ?.. తారక మంత్రం ఫలించేనా?

 విస్తృత ఏర్పాట్లు..

విస్తృత ఏర్పాట్లు..

శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సభ జరిగే ప్రాంగణం చుట్టూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను తరలివస్తున్నారు. ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి 3వేల మందికి పైగా రానుండటంతో.. సభా ప్రాంగణంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి వేర్వేరుగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. 25వేల మందికి సరిపడా భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు గంగుల.

సెల్ టవర్ ఎక్కిన ప్రేమికురాలు.. దిగొచ్చిన ప్రేమికుడు.. మూడుముళ్లతో ఏకం

 ఘన స్వాగతం.. గులాబీమయం

ఘన స్వాగతం.. గులాబీమయం

పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో తొలి సన్నాహక సమావేశానికి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో విచ్చేస్తున్న కేటీఆర్ కు ఘన స్వాగతం పలకనుంది జిల్లా నాయకత్వం. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 10.30 - 11.00 గంటల మధ్యలో కరీంనగర్ కు రానున్నారు కేటీఆర్. ఆ క్రమంలో మానేరు బ్రిడ్జి దగ్గర ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం వందలాది వాహనాలతో సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యమధ్యలో రాంపూర్ సర్కిల్, కమాన్, సిక్ వాడి, కోర్టు చౌరస్తాలో మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలకనున్నారు. గులాబీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు.. ఇలా కేటీఆర్ కు స్వాగతం పలకడానికి నగరమంతా పింక్ మయమైంది.

English summary
The TRS party ready to fight for lok sabha elections. The goal is to set foot in 16 positions for 17 positions. TRS believes that the karimnagar is lucky place for party. In that view lok sabha elections party meetings starts from karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X