వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ ఎఫెక్ట్: పెరుగుతున్న వలసలు, దిద్దుబాటలో టిడిపి

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తర్వాత టిడిపిలో వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలు వలసబాట పట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ తర్వాత టిడిపిలో వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలు వలసబాట పట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.కొందరు టిడిపి ముఖ్య నేతలు టిఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకొనేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని సమాచారం.

రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?రేవంత్ ఎఫెక్ట్: కోమటిరెడ్డిపై ప్రభావం, మూడో కూటమితో ఎవరికి నష్టం?

రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ టిడిపిలో కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. అయితే అదే సమయంలో ఏ పార్టీలో చేరితే రాజకీయంగా తమకు ప్రయోజనమని బేరీజు వేసుకొన్న తర్వాత కొందరు నేతలు టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకొంటున్నారు.

కాంగ్రెస్‌కు 70 సీట్లు, రేవంత్‌కు ప్రచారం, గుత్తాకు చెక్‌కే కంచర్ల: కోమటిరెడ్డి సంచలనం కాంగ్రెస్‌కు 70 సీట్లు, రేవంత్‌కు ప్రచారం, గుత్తాకు చెక్‌కే కంచర్ల: కోమటిరెడ్డి సంచలనం

ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు టిఆర్ఎస్‌లో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఆ నేతలంతా ఇటీవలే సీఎం కెసిఆర్‌ను కలిశారని కూడ ప్రచారం సాగుతోంది.

రేవంత్‌ దెబ్బ: ఆ లేఖ ఎక్కడుంది, చంద్రులకు చుక్కలేనా? రేవంత్‌ దెబ్బ: ఆ లేఖ ఎక్కడుంది, చంద్రులకు చుక్కలేనా?

ఆ ఇద్దరు టిఆర్ఎస్‌లోకి

ఆ ఇద్దరు టిఆర్ఎస్‌లోకి

రేవంత్ రె్డ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరని నేతలు తమ రాజకీయ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర పార్టీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్యాల రవీందర్‌రావు, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రు నాగయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది.ఈ మేరకు వీరిద్దరూ కూడ శనివారం నాడు సీఎం కెసిఆర్‌ను కలిశారనే ప్రచారం సాగుతోంది. ఈ నెల 15న టిఆర్ఎస్‌‌లో చేరే అవకాశం ఉందని సమాచారం.

నర్సింగరావు కూడ పార్టీ మారేనా?

నర్సింగరావు కూడ పార్టీ మారేనా?

రాజన్న సిరిసిల్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నర్సింగరావు వలసబాట పట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. టీఆర్‌ఎస్‌లో చేరతారా.. కాంగ్రెస్‌లోకి వెళతారా అనే విషయం మాత్రం గోప్యంగానే ఉంచుతున్నట్లు తెలిసింది. అన్నమనేని నర్సింగరావు పార్టీని వీడుతారనే ప్రచారం కూడ జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గతంలో కూడ ఇదే తరహలో నేతలు పార్టీలు మారుతారనే మైండ్‌గేమ్ సాగిందని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.

పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా?

పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా?

తెలంగాణలో టిడిపికి పూర్వ వైభవం వచ్చేనా అనే చర్చ సాగుతోంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టిడిపికి ఇలాంటి రాజకీయ సంక్షోభాలు కొత్తేమీకాదని ఆ పార్టీకి చెందిన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా టిడిపి కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం లేకపోలేదంటున్నారు.

తెలంగాణలో ఏం చేయాలి

తెలంగాణలో ఏం చేయాలి

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ నాయకత్వం మేథోమథనం చేస్తోంది. ఈ విషయమై పార్టీ సీనియర్లతో బాబు ఇటీవలే చర్చించారు. ప్రతి మాసం రెండవ తేదిన తెలంగాణ నేతలతో సమావేశం కానున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వతహగా ఆ పార్టీ బలాన్ని పెంచుకొనేందుకుగాను వ్యూహలను రూపొందించుకోవాలి. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు క్యాడర్‌ను కాపాడుకొనే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

English summary
There is a spreading a rumour Karimnagar Tdp leaders Ravinder Rao and Karru Nagaiah will join in TRS. They will join in Trs on Nov 15. Siricilla TDP president Narsing Rao also trying to leave TDP.ః
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X