హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదీ విషయం: కేసీఆర్-పవన్ భేటీ గుట్టువిప్పిన టీఆర్ఎస్ నేత, జనసేనానికి ఆల్ ది బెస్ట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan & KCR's meeting : కేసీఆర్ - పవన్ భేటీ : 'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై' !

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని విపక్షాలు విమర్శలు చేయడంపై టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి విమర్శలు అర్థరహితమని చెప్పారు.

తెలంగాణ పర్యటన వెనుక కొత్త వాదన, వెనుక కేసీఆర్!: కొండగట్టుకు రూ.11 లక్షల విరాళంతెలంగాణ పర్యటన వెనుక కొత్త వాదన, వెనుక కేసీఆర్!: కొండగట్టుకు రూ.11 లక్షల విరాళం

ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ పైన కూడా మండిపడ్డారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఓ విషయం చెప్పారు. ఇటీవల అజ్ఞాతవాసి సినిమా విడుదలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పవన్ ఎందుకు కలిశారో కూడా తెలిపారు. కర్నె సోమవారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో పవన్ కీలక నిర్ణయాలు!: పక్కా ప్లాన్‌తో ముందుకు, వారికే ప్రాధాన్యంతెలంగాణలో పవన్ కీలక నిర్ణయాలు!: పక్కా ప్లాన్‌తో ముందుకు, వారికే ప్రాధాన్యం

 ఏ రహస్య ఒప్పందమూ లేదు

ఏ రహస్య ఒప్పందమూ లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం లేదని కర్నె ప్రభాకర్ చెప్పారు. ఒప్పందమని ఆరోపణలు చేసిన పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు, ఆరోపణలు అర్థరహితమని చెప్పారు. తెలంగాణలో తమకు ఎదురులేదని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ అందుకే కలిశారు

పవన్ కళ్యాణ్ అందుకే కలిశారు

పవన్ కళ్యాణ్ తన అజ్ఞాతవాసి సినిమాకు అయిదు షోల అనుమతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారని కర్నె చెప్పారు. కానీ తాము పవన్ కళ్యాణ్‌తో రహస్య ఒప్పందం పెట్టుకునేంత బలహీనంగా లేమని చెప్పారు.

 పవన్ పైన కర్నె విమర్శలు

పవన్ పైన కర్నె విమర్శలు

పవన్ కళ్యాణ్ పైనా కర్నె విరుచుకుపడ్డారు. పవన్ సీజనల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆయన వల్ల తమకు లాభమూ లేదు, నష్టమూ లేదని అభిప్రాయపడ్డారు. ఆయన పూర్తిస్థాయి నేతగా మారి యాత్ర చేస్తే మాత్రం శుభాకాంక్షలు చెబుతామని, ఆల్ ది బెస్ట్ అన్నారు.

 తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన

తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన

పవన్ కళ్యాణ్ సోమవారం నుంచి తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తొలుత కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌లో జనసేన పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు.

English summary
TRS leader and MLC Karne Prabhakar slams Pawan Kalyan, Congress, BJP on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X