వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబితా ఇంద్రారెడ్డి సంచలన నిర్ణయం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా?: ప్రగతి భవన్‌కు సండ్ర

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం శాసన సభ్యురాలు, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తనయుడు కార్తీక్ రెడ్డితో కలిసి ఆమె అధికార పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. జానారెడ్డి, రేవంత్ రెడ్డి వంటి నేతలు మొదలు రాహుల్ గాంధీ ఫోన్లో బుజ్జగించినా తగ్గలేదు. కారు ఎక్కాలని నిర్ణయించుకున్నారు.

<strong><br>రెండేళ్ల కిందటే సీబీఐకి ఈడీ సంచలన లేఖ!: ఎన్నికలకు ముందు జగన్‌కు 'హైదరాబాద్' షాక్</strong>
రెండేళ్ల కిందటే సీబీఐకి ఈడీ సంచలన లేఖ!: ఎన్నికలకు ముందు జగన్‌కు 'హైదరాబాద్' షాక్

 ప్రగతి భవన్‌కు సబిత, కార్తీక్ రెడ్డి

ప్రగతి భవన్‌కు సబిత, కార్తీక్ రెడ్డి

ఈ నేపథ్యంలో బుధవారం సబిత, కార్తీక్ రెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ వచ్చారు. అధినేత సమక్షంలో వారు తెరాసలో చేరనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడం, ఇటీవల శంషాబాద్ రాహుల్ గాంధీ బహిరంగ సభలో తనయుడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, చేవెళ్ల టిక్కెట్ అడిగితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వంటి కారణాలతో వారు కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

సబిత సంచలన నిర్ణయం

సబిత సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరాలనున్న సబితా ఇంద్రారెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆమె మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పైన గెలిచారు. ఇప్పుడు తెరాసలో చేరుతున్నందున ఆ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికల్లో తెరాస టిక్కెట్ పైన గెలుపొందడం మంచిదని భావిస్తున్నారట.

 ప్రగతి భవన్‌కు సండ్ర వెంకట వీరయ్య

ప్రగతి భవన్‌కు సండ్ర వెంకట వీరయ్య

సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డిలతో పాటు సండ్ర వెంకట వీరయ్య కూడా ప్రగతి భవన్‌కు వచ్చారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అనధికారికంగా ఆయన తెరాసలోకి ఎప్పుడో వచ్చారు. ఇప్పుడు అధికారికంగా కారు ఎక్కేందుకు ఇక్కడకు వచ్చారు. ఆయన ఓటుకు నోటు కేసులో కూడా ఉన్న విషయం తెలిసిందే.

English summary
Former Home Minister Sabitha Indra Reddy and her son Karthik Reddy to join TRS soon. Sabitha Indra Reddy may resign for MLA from Maheswaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X