వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2 షరతులు: అసదుద్దీన్ ఇంట్లో కేటీఆర్‌తో సబితా భేటీ, అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశారు. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాసంలో వీరు భేటీ అయ్యారు. వారు తెరాసలో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ కలయిక, వారి ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. వారు దాదాపు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!కాంగ్రెస్‌కు భారీ షాక్: తెరాసలోకి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, మధ్యవర్తి అసదుద్దీన్!

కేటీఆర్ ముందు సబితా ఇంద్రారెడ్డి షరతులు

కేటీఆర్ ముందు సబితా ఇంద్రారెడ్డి షరతులు


తెరాసలో చేరేందుకు సబితా ఇంద్రా రెడ్డి రెండు షరతులు విధించినట్లుగా తెలుస్తోంది. ఒకటి చేవెళ్ల లోకసభ స్థానాన్ని తన తనయుడు కార్తీక్ రెడ్డికి ఇవ్వడం, రెండోది తనకు మంత్రి పదవి ఇవ్వడం. ముఖ్యంగా తన కొడుకుకు చేవెళ్ల సీటు పైనే ఆమె ప్రధానంగా దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ భేటీకి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. లోకసభ ఎన్నికల అనంతరం కేసీఆర్ కేబినెట్లో మహిళలకు చోటు దక్కుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తన కొడుకుకు చేవెళ్ల లోకసభ సీటుతో పాటు, తనకు మంత్రి పదవి గురించి ఆమె ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే లోకసభ సీటుకు ఓకే కానీ, మంత్రి పదవికి మాత్రం తెరాస సానుకూలంగా లేదని తెలుస్తోంది.

రాజేంద్ర నగర్ టు చేవెళ్ల.. అక్కడా కార్తీక్ రెడ్డికి చేదు

రాజేంద్ర నగర్ టు చేవెళ్ల.. అక్కడా కార్తీక్ రెడ్డికి చేదు


గత అసెంబ్లీ ఎన్నికల్లో సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజేంద్ర నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా దీనిని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఆ సమయంలోనే చేవెళ్ల లోకసభ స్థానం ఇస్తామని కార్తీక్ రెడ్డికి హామీ ఇఛ్చారని తెలుస్తోంది. కానీ అంతకుముందే 2014లో తెరాస నుంచి గెలిచిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇప్పుడు టిక్కెట్ దాదాపు ఆయనకు ఖాయం కావడం సబిత, కార్తీక్‌లు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, కొండా విశ్వేశ్వర రెడ్డి చేరిక పైన కనీసం సమాచారం లేదని అంటున్నారు.

కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి

కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి

మరోవైపు, శనివారం నాటి పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సభలో కనీసం తమను పరిచయం చేయలేదని కార్తీక్ రెడ్డి వాపోతున్నారు. తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని సబిత ఆందోళన చెందుతున్నారట. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ మధ్యవర్తిత్వంతో.. కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టిక్కెట్ హామీతో తెరాస వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తనకు కేబినెట్లో చోటు ఇవ్వాలని కూడా సబిత కోరుతున్నారట. అదే జరిగితే వచ్చే లోకసభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి (కాంగ్రెస్), కార్తీక్ రెడ్డి మధ్య రసవత్తర పోరు ఉండనుందని అంటున్నారు.

English summary
Telangana Congress senior leader and former minister Sabitha Indra Reddy met TRS working president KTR in MP Asaduddin Owaisis's house on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X