వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పెళ్ళై ఏడు నెలలే భార్య కాళ్ళు, చేతులు కట్టేసి బాటిల్ తో బాదేసుకొన్నాడు

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కార్తీక్ కుమార్ అనే యువకుడు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే తాను ఆత్మహత్య చేసుకోనే సమయంలో భార్య అడ్డుకోకుండా ఉండేందుకుగాను ఆమె కాళ్ళు, చేతులు కట్టేసి ఆమె చున్నీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కార్తీక్ కుమార్ అనే యువకుడు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు.అయితే తాను ఆత్మహత్య చేసుకోనే సమయంలో భార్య అడ్డుకోకుండా ఉండేందుకుగాను ఆమె కాళ్ళు, చేతులు కట్టేసి ఆమె చున్నీతోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన హైద్రాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది.

హైద్రాబాద్ లోని ఉప్పుగూడ ఆశోక్ నగర్ కు చెందిన వెంకటేశ్ కుమారుడు కార్తీక్ కుమార్ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఏడు మాసాల క్రితం మేనమామ కుమార్తై దీపారాణితో వివాహమైంది.

suicide

అయితే వారిద్దరూ సంతోష్ నగర్ లో కాపురం పెట్టారు. కాగా, కార్తీక్ ఇటీవల ఓ సెల్ ఫోన్ ను దొంగతనం చేసి తన సమీప బంధువుకు రూ.5,500 లకు విక్రయించాడు.

అయితే ఈ ఫోన్ ను దొంగిలించింది కార్తీక్ కుమార్ గా పోలీసులు తేల్చారు. అయితే ఈ విషయమై కార్తీక్ ను పోలీసులు మందలించి వదిలేశారు. అంతేకాదు అతడు దొంగిలించిన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

అయితే శనివారం రాత్రి ఇంటికి చేరుకొన్న కార్తీక్ మద్యం మత్తులో తన ఆర్థిక సమస్యలపై భార్య వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. మత్తులో మద్యం బాటిల్ తో తలపై బాదుకోవడం మొదలుపెట్టాడు. దీన్ని భార్య అడ్డుకొంది.

దీంతో భార్య కాళ్ళు, చేతులను కార్తీక్ కట్టేశాడు. ఆమె చున్నీతోనే ఇంటిపై కప్పుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. భార్య పెద్ద పెట్టున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చారు. అంబులెన్స్ వచ్చేసరికి కార్తీక్ మరణించాడు. సంతోష్ నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

English summary
Karthik suicide for financial crisis in Hyderabad on Sunday. he married deepa before seven months. they living in Santosh Nagar.Karhik suicide on sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X