వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ బాధ్యత కేసీఆర్ కు ఇవ్వండి ! ఆయన పరిష్కరిస్తారట.. మోడీకి లేఖ రాస్తానంటున్న కాంగ్రెస్ సీనియర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హునుమంతరావు. రాష్ట్ర సమస్యలు పట్టని కేసీఆర్ .. దేశంలో నెలకొన్న ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తారని దుయ్యబట్టారు. పనిలోపనగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని వారిని ప్రశ్నించారు.

సిఫాయికి కాశ్మీర్ బాధ్యత అప్పగించండి ..

సిఫాయికి కాశ్మీర్ బాధ్యత అప్పగించండి ..

గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ .. మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు. విభజన సమస్యలు, ఇతర అంశాల పరిష్కారం కోసం కృషిచేయని కేసీఆర్ .. కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తారట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ .. సున్నీతమైన కాశ్మీర్ ఇష్యూని పరిష్కరిస్తానని చెప్తున్నారు. అలా అయితే తానే స్వయంగా కల్పించుకోని ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వీహెచ్ పేర్కొన్నారు.

మేధావి పరిష్కరిస్తాడట ..?

మేధావి పరిష్కరిస్తాడట ..?

రాష్ట్రంలో ఒక మేధావి ఉన్నాడని .. అపరిష్కృత అంశాన్ని సాల్వ్ చేస్తానంటున్నాడని చెబుతానని వీహెచ్ అంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాధించానని చెప్పే కేసీఆర్ .. కాశ్మీర్ కూడా పరిష్కరిస్తాడని మోదీకి లేఖలో వివరిస్తానని వీహెచ్ ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అహంకారం, ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ తెలుస్తుంది: కేటీఆర్, పవన్ కళ్యాణ్‌కు గ్రీన్ సిగ్నల్!!చంద్రబాబు అహంకారం, ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ తెలుస్తుంది: కేటీఆర్, పవన్ కళ్యాణ్‌కు గ్రీన్ సిగ్నల్!!

రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది ?

రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది ?

రాష్ట్ర కాంగ్రెస్ నేతల వైఖరిపై మండిపడ్డారు వీహెచ్. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. రోజుకొకరు పార్టీ మారుతుంటే పీసీసీ చీఫ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను ఆపేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ఉత్తమ్‌ను ప్రశ్నించారు.

రాహుల్‌ను కలువనీయడం లేదు

రాహుల్‌ను కలువనీయడం లేదు

రాష్ట్ర కాంగ్రెస్ నేతల బండారం బయటపెడుతానని ... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలువనీయడం లేదని ఆరోపించారు వీహెచ్. రాహుల్‌ను కలిసేందుకు గత 5 నెలల నుంచి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఓ సీనియర్ నేత పట్ల మీ వైఖరి సరికాదని మండిపడ్డారు.

English summary
KCR, who has not worked for the solution of the division issues and other issues, will solve the Kashmir issue. Senior Congress leader Hanumantha Rao For many years, the solution is to solve the sensitive Kashmir issue. So, VH said that he would write a letter to the Prime Minister himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X