వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ రావు అంతేనా: కెసిఆర్ వారసత్వంపై తేల్చేసిన కవిత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చిచ్చు రేపుతాయా అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వారసత్వ పోటీ నుంచి తాను తప్పుకోవడమే కాకుండా మంత్రి హరీష్ రావు కూడా లేరని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తేల్చేశారు.

హరీష్ రావు లేరని ఆమె నేరుగా చెప్పకపోయినప్పటికీ కెసిఆర్ వారసుడు తన సోదరుడు కెటి రామారావేనని చెప్పడం ద్వారా హరీష్ రావును తప్పించినట్లేనని అనుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెటి రామారావు సామర్థ్యాన్ని బయటపెట్టాయి. ఎన్నికల్లో అంతా తానే వ్యవహరించి, తిరుగులేని విజయాన్ని అందించడం ద్వారా కెటిఆర్‌ నాయకత్వ సామర్థ్యం బయటపడిందని అంటున్నారు.

 Kavitha clarifies on KTR leadership

దాంతో హరీష్ రావు వెనకబడిపోయినట్లేనని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని గ్రహించినట్లు కవిత మాటలు ఉన్నాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు కెటిఆరేనని ఆమె చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో చాలా మార్పు వచ్చిందని ఆమె అన్నారు. నగరంలోని అన్ని వర్గాలవారు తమ పార్టీకి ఓటేశారని ఆమె చెప్పారు. అందుకే విజయం దక్కిందని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అనూహ్యంగా 99 స్థానాలను గెలుచుకుని స్వయంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థితికి చేరుకుంది. ఈ క్రెడిట్ మొత్తం ఇప్పుడు కెటిఆర్‌కే దక్కుతుంది. ఇదే సమయంలో మున్సిపల్ శాఖ కూడా కెటిఆర్ చేతికి రానుంది.

English summary
Nizamabad Telangana Rastra Samithi (TRS) MP kalvakuntla Kavith said that his father and CM K Chandrsekhar Rao's political successor will be KT Rama Rao (KTR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X