నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుష్ట చతుష్టయం: కాంగ్రెస్-టీడీపీపై కవిత విమర్శలు, నిజామాబాద్‌లో పర్యటన

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: తెలంగాణలో ముందస్తు రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పటికే రాజకీయ పార్టీల నేతల పరస్పర విమర్శలతో విచురుకుపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో ఏర్పాటవుతున్న మహా కూటమిపై తాజాగా నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు.

తప్పులు రిపీట్ కావొద్దు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ కీలక సూచనలుతప్పులు రిపీట్ కావొద్దు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ కీలక సూచనలు

నిజామాబాద్‌లో బుధవారం పర్యటించిన కవిత.. పలు వినాయక మండపాలను సందర్శించారు. ఆమె వెంట నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

Kavitha fires at Congress and TDP alliance

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహా కూటమి ఓ దుష్టచతుష్టయ కూటమి అని విమర్శించారు. తెలంగాణ ప్రజలపాలిట అదో శాపమని అన్నారు. ఓట్ల గల్లంతు విషయంలో కాంగ్రెస్ పార్టీ కావాలనే తమ పార్టీపై బురదజల్లుతోందని ధ్వజమెత్తారు. ఓట్ల వ్యవహారం ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలని ఆమె సూచించారు.

Kavitha fires at Congress and TDP alliance

కాంగ్రెస్, టీడీపీలు ఇప్పటికే ప్రజలను పీక్కుతిన్నాయని, రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ మీద ప్రేమ లేని పార్టీలు మహా కూటమిలో వస్తున్నాయన్నారు. గత 60ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో కేసీఆర్ చేసి చూపించారని కవిత అన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని గమనిస్తున్నారని అన్నారు.

English summary
Nizamabad MP and TRS leader Kalvakuntla Kavitha on Wednesday fired at Congress and TDP alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X