వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త కోడలికి అత్తింటి వేధింపులా వుంది: ప్రతిపక్షాల తీరుపై కవిత ఫైర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ 60ఏళ్ల పాలనలో విపక్షాలు ఏమీ చేయలేక ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నాయని, వారి గగ్గోలు కొత్త కోడలిని అత్తింటి వారు వేధించినట్లు ఉందని ధ్వజమెత్తారు.

మంగళవారం రాత్రి ఫతేనగర్‌, మూసాపేట, ఎర్రగడ్డ డివిజన్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె మాట్లాడారు. అరవై ఏళ్ల ప్రతిపక్షాల పాలనలో సాధ్యం కాని అభివృద్ధిని ఐదేళ్లలో చూపిస్తామని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. అన్నేళ్లలో సాధ్యం కాని పనుల్ని స్వల్పకాలంలోనే చేసి చూపిన ఖ్యాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు.

190కి పైగా సంక్షేమ పథకాలు, ప్రజోపయోగకర పనులు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గతంలో కరెంటు కోతలతో నగరవాసులు అల్లాడిపోయేవారని, ఇప్పుడు రెప్పపాటైనా కోత లేకుండా ప్రజలకు విద్యుత్తు ఇస్తున్నామన్నారు.

పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చామని ఇందులో ప్రధానంగా పేదలకు రెండు పడకగదుల ఇళ్లు ఇస్తున్నామన్నారు. నగరంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వీటిని ఇస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

తమ 60ఏళ్ల పాలనలో విపక్షాలు ఏమీ చేయలేక ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నాయని, వారి గగ్గోలు కొత్త కోడలిని అత్తింటి వారు వేధించినట్లు ఉందని ధ్వజమెత్తారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

మంగళవారం రాత్రి ఫతేనగర్‌, మూసాపేట, ఎర్రగడ్డ డివిజన్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆమె మాట్లాడారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

అరవై ఏళ్ల ప్రతిపక్షాల పాలనలో సాధ్యం కాని అభివృద్ధిని ఐదేళ్లలో చూపిస్తామని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. అన్నేళ్లలో సాధ్యం కాని పనుల్ని స్వల్పకాలంలోనే చేసి చూపిన ఖ్యాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

190కి పైగా సంక్షేమ పథకాలు, ప్రజోపయోగకర పనులు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. గతంలో కరెంటు కోతలతో నగరవాసులు అల్లాడిపోయేవారని, ఇప్పుడు రెప్పపాటైనా కోత లేకుండా ప్రజలకు విద్యుత్తు ఇస్తున్నామన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చామని ఇందులో ప్రధానంగా పేదలకు రెండు పడకగదుల ఇళ్లు ఇస్తున్నామన్నారు. నగరంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వీటిని ఇస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 18నెలల్లోనే 190 అభివృద్ధి పనులు చేసి చూపించిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

మూడు నెలల్లోనే 24గంటల విద్యుత్ సరఫరాకు కృషిచేసిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్, మూసాపేట డివిజన్‌లోని చిత్తారమ్మ గ్రౌండ్, ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన సభల్లో ఆమె మాట్లాడారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

సీఎం కేసీఆర్ చేసేదే చెప్తాడని, చెప్పింది పక్కాగా చేసి చూపిస్తారన్నారు. వచ్చే రెండేళ్లలో 24గంటల పాటు ప్రతి ఇంటికి తాగునీరును అందిస్తామన్నారు. అందుకోసం సీఎం ఇప్పటకే నగరానికి ఉత్తరాన ఒక రిజర్వాయర్, దక్షిణాన ఒక రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారని, పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

నగర జనాభాను దృష్టిలో పెట్టుకునే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు నగరంలోని తాగునీరు, డ్రైనేజి, విద్యుత్, రోడ్ల సమస్యలను పట్టించుకోలేదని, ఫలితంగా ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

గత ప్రభుత్వాలు కేవలం రూ.70వేలతో డబ్బా ఇండ్లు కట్టించాయని, కేసీఆర్ సర్కార్ సంపన్నులు నివసించే ఇండ్లలెక్క అన్ని హంగులతో ఒక్కో ఇంటికి రూ.7లక్షలు వెచ్చించి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నదన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం



నగరంలో భూ సమస్య కారణంగా 9 అంతస్తుల భవనాలను నిర్మిస్తుందని, వాటిలో లిఫ్ట్‌లను కూడా ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

హైదరాబాద్ నగరంలో మొత్తం లక్ష ఇండ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ ఇండ్లు ప్రతి నిరుపేదకు పారదర్శకంగా అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కవిత ప్రచారం

కవిత ప్రచారం

ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వారి బస్తీల్లో, స్థానికుల సమక్షంలోనే లాటరీ పద్ధతి ద్వారా అందచేస్తామన్నారు. తెలంగాణ వస్తే భద్రత కరువైతదని ప్రతిపక్షాలు గోల చేశాయని, కానీ ఇప్పుడు నగర పోలీసులను మించిన వారు దేశంలో లేరని అన్నారు.

English summary
TRS MP Kalvakuntla Kavitha on Tuesday fired at opposition party in GHMC campaign in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X