వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా క్యాబినెట్ మంత్రిగా కవిత ? .. మళ్ళీ కేసీఆర్ తనయపై గులాబీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ ఎస్ పార్టీలో కీలక మార్పులు జరగబోతున్నాయి అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెడుతున్నారని , అందుకే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతుంది . కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కు త్వరలోనే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుందంటూ ప్రచారం జరుగుతుండగా ఇక కవితకు కూడా తెలంగాణా క్యాబినెట్ లో స్థానం కల్పిస్తారని ఆసక్తికర చర్చ మొదలైంది.

కేటీఆర్ కు కొత్త కష్టాలు తెచ్చిన మునిసిపల్ ఎన్నికల వ్యూహం .. కేటీఆర్ ఏం చేస్తారో ?కేటీఆర్ కు కొత్త కష్టాలు తెచ్చిన మునిసిపల్ ఎన్నికల వ్యూహం .. కేటీఆర్ ఏం చేస్తారో ?

 సైలెంట్ గా ఉంటున్న కవిత ... రకరకాల ఊహాగానాలు

సైలెంట్ గా ఉంటున్న కవిత ... రకరకాల ఊహాగానాలు

గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఘోర ఓటమి చవి చూసిన కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత అప్పటి నుండి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికి ఆమె విషయంలో పలు మార్లు ఆమెకు మంత్రిగా స్థానం కల్పిస్తారని, రాజ్య సభకు పంపుతారని , పార్టీలో కీలక పదవి కట్టబెడతారని రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్కటి జరగలేదు. సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో కానీ, కవిత పదవుల విషయంలో కానీ ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు.

కవిత రాజ్యసభకు వెళ్ళటం ఇష్టం లేదని చెప్తున్నారని గులాబీ శ్రేణుల్లో చర్చ

కవిత రాజ్యసభకు వెళ్ళటం ఇష్టం లేదని చెప్తున్నారని గులాబీ శ్రేణుల్లో చర్చ

ఇక నిన్నా మొన్నటి దాకా రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావనే లేదు . ఎందుకంటే, కవితకు అసలు రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నారని సమాచారం. అందుకే, తనకు రాజ్యసభ సభ్యత్వం వద్దంటూ కవిత తేల్చిచెప్పిందంటూ గులాబీ శ్రేణులలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
కేసీఆర్ బిడ్డగా గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు వరకు చాలా యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత నిజామాబాద్లో ఓడిపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యారు. ఇక అప్పటి నుండి ఏడాదిగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు.

రాష్ట్ర మంత్రిగా కవితకు అవకాశం ?

రాష్ట్ర మంత్రిగా కవితకు అవకాశం ?

అయితే, కవితను మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారా? ఏం చెయ్యబోతున్నారు అన్న ఆసక్తి ఏడాది కాలంగా పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇక ఈ నేపధ్యంలోనే తాజా పరిణామాలతో కవిత అతి త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో కవిత యాక్టివ్ కాబోతున్నారనే టాక్ గులాబీ శ్రేణుల్లో నడుస్తోంది. రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారని చెప్తున్నా ఆ వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అన్నది మాత్రం సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తేనే తేలుతుంది . అయితే, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి కేబినెట్లోకి తీసుకుంటారా ? లేకా మరేదైనా ఆలోచన ఉందా అనేది లోగుట్టు కేసీఆర్ కు , కవితకు మాత్రమే ఎరుక .

English summary
The Telangana state is going through a major campaign in the TRS. Discussion continues in the ranks of the party that CM KCR is focusing on national politics and hence making several key decisions. KCR's son Minister KTR will soon be promoted to the position of Deputy Chief Minister, and there is an interesting debate that the Kavitha will also be placed in the Telangana Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X