వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న కేసీఆర్‌కు కేటీఆర్ ఝలక్! మోడీపై మా నాన్న టంగ్ స్లిప్: ఎంపీ కవిత

|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR Slips Tongue On Modi : Reactions

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాస్త కటువుగానే మాట్లాడారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం అన్నారు. ప్రధాని మోడీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశ్యం తమకు లేదన్నారు.

తెరపైకి జూ.ఎన్టీఆర్, తెలంగాణలో టీడీపీ ఉంటుంది: బాబు కీలక వ్యాఖ్యలు, కేసీఆర్‌తో పొత్తుపై..తెరపైకి జూ.ఎన్టీఆర్, తెలంగాణలో టీడీపీ ఉంటుంది: బాబు కీలక వ్యాఖ్యలు, కేసీఆర్‌తో పొత్తుపై..

తన ప్రసంగంలో కేసీఆర్ మోడీని ఉద్దేశ్యపూర్వకంగా అనలేదని, మాట్లాడుతుండగా ఫ్లోలో అలా అన్నారని చెప్పారు. చిన్న పొరపాటును బీజేపీ నేతలు రాద్దాంతం చేయడం సరికాదన్నారు. రైతుల పట్ల ఆవేదనతో కేసీఆర్ కాస్త కటువుగా మాట్లాడారన్నారు. గతంలో మోడీ కూడా పొరపాటున 600 కోట్ల మంది తనకు ఓటేశారని చెప్పారు కదా అన్నారు. మోడీగారు అనబోయి ప్రసంగంలో తప్పుదొర్లిందన్నారు.

ఏపీకి హోదా కోసం 2014 నుంచే

ఏపీకి హోదా కోసం 2014 నుంచే

విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలని కవిత కేంద్రాన్ని కోరారు. పార్లమెంటు వేదికగా తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచే తాము మద్దతిస్తున్నామని చెప్పారు.

కేసీఆర్ టంగ్ స్లిప్

కేసీఆర్ టంగ్ స్లిప్

ప్రధాని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై కవిత స్పందిస్తూ.. 'నాన్నగారు అలా మాట్లాడుతారని అనుకోను. స్లిప్ ఆఫ్ ది టంగ్ అయి ఉంటుందనుకుంటా' అని వ్యాఖ్యానించారు.

నిర్మల ఆవేదన

నిర్మల ఆవేదన

మోడీపై కేసీఆర్ వాడిన పదజాలం తనకు నచ్చలేదని, ీసఎం వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలను బాధించాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సీఎం, ప్రధాని వంటి వారు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవుల్లో ఉన్నారని, అలాంటప్పుడు మాట్లాడే తీరు సరిగా ఉండాలన్నారు.

కేటీఆర్‌తో మాట్లాడా

కేటీఆర్‌తో మాట్లాడా

ప్రధాని మోడీని కేసీఆర్‌ ఏకవచనంతో సంభోదించడం సరికాదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదిభట్లలో బోయింగ్‌-టాటా కంపెనీ కార్యక్రమానికి హాజరుకావడానికి ముందే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని, ప్రధాని మోడీ పట్ల కేసీఆర్‌ అనుచితంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను ఈ కార్యక్రమానికి రావడం బాగుండదని చెప్పానని అన్నారు.

 కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్‌ను నిలదీశా

కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్‌ను నిలదీశా

కేసీఆర్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ను నిలదీశానని, తాను ఈ కార్యక్రమానికి రావాలా వద్దా? అని ప్రశ్నించానని, సభా వేదిక పైన కూడా కేటీఆర్‌ను నిలదీశానని, తన తండ్రి అలా మాట్లాడతారని తాను అనుకోనని కేటీఆర్‌ చెప్పారని, మేకిన్ ఇండియాకు, తెలంగాణకు, ఏరోస్పెస్‌ రంగానికి దోహదం చేసే కార్యక్రమం కాబట్టి ఆదిభట్లలో జరిగిన కార్యక్రమానికి వచ్చానని నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే.

 కేసీఆర్ వివరణ ఇవ్వాల్సింది

కేసీఆర్ వివరణ ఇవ్వాల్సింది

వేదికపై కేటీఆర్‌తో మరోసారి మాట్లాడినప్పుడు నోరుజారి ఉంటే, ఆ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదని కేటీఆర్‌కు చెప్పానని నిర్మలా సీతారామన్ అన్నారు. సిద్ధాంతపరంగా వైరుధ్యాలతో విమర్శలు చేస్తే వాటిని తాము వింటామని, పార్టీ స్పందిస్తుందని, చెప్పాల్సిన పద్ధతిలో చెబితే సమాధానమిస్తామన్నారు.

English summary
Defence Minister Nirmala Sitharaman on Thursday said that she was upset about Telangana Chief Minister K Chandrasekhar Rao using a particular Telugu word for Prime Minister Narendra Modi, along with others in the BJP and even the entire country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X