హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్న సంఘటనలతో హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ కాదు: కవిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిన్న చిన్నసంఘటనలతో హైదరాబాద్ ఇమేజ్ డామేజ్ కాదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కల్వకుంట్ల కవిత సోమవారం నాడు అన్నారు. హెచ్‌‍సియులో రోహిత్ వేముల ఆత్మహత్య బాధాకరమన్నారు.

ఏదైనా అంశంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థుల పైన దాడి చేసినట్లు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సామాజిక పరమైన అంశాలలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని చెప్పారు.

Kavitha responds on Vemula Rohith suicide

30న విద్యా వ్యవస్థపై సమగ్ర చర్చ : కడియం

విద్యా వ్యవస్థపై శాసనసభలో ఈ నెల 30న సమగ్ర చర్చ నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. విద్యా శాఖ పద్దులపై కడియం శాసనసభలో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో 46 శాతం, ప్రయివేటు పాఠశాలల్లో 54 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు.

గత పాలనలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టతకు సభ్యులు విలువైన సూచనలివ్వాలని ప్రతిపక్షాలను కోరారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో అనేక ప్రాథమిక పాఠశాలలు ఉండటం వల్ల ఏ పాఠశాల కూడా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నదన్నారు.

ఇష్టారాజ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం వల్ల పుట్టగొడుగుల్లా కళాశాలలు పుట్టుకొచ్చాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు పెట్టి టీచింగ్ స్టాఫ్‌ను పట్టించుకోలేదని, తగిన సిబ్బందిని కేటాయించలేదన్నారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

English summary
MP Kalvakuntla Kavitha responds on Vemula Rohith suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X