వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత క్యాబినెట్‌‌లోకి ఖాయమా.? కేసీఆర్ ఎవరికీ చెక్ పెడతారు, 15 నెలల తర్వాత మరీ..?

|
Google Oneindia TeluguNews

కేసీఆర్ తనయ కవిత ఇందూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా పోయిన కవిత.. అక్కడే విజయంతో తన సత్తా చాటారు. ఓకే కవిత విజయం సాధించారు. మరీ వాట్ నెక్ట్స్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కవిత విజయం సాధించడమే తరువాయి.. మంత్రి పదవీ ఉందని టీఆర్ఎస్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరిగింది. మరీ విజయం సాధించే ప్రక్రియ ముగిసింది.. మరీ ఆమెను మంత్రివర్గంలోకి ఆహ్వానించడమే మిగిలిపోయింది.

కేసీఆర్ ఓకే.. కానీ

కేసీఆర్ ఓకే.. కానీ

కవితను మంత్రివర్గంలోకి తీసుకొనేందుకు కేసీఆర్ సుముఖంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో గల నియోజకవర్గాల ప్రకారం 17 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఇప్పుడు సరిగ్గా అంతేమందితో ప్రభుత్వం కొలువుదీరి ఉన్నది. మరీ కవిత్ ఇన్.. అంటే ఎవరూ ఔట్ అనే చర్చ జరుగుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలను తీసి పక్కనపెట్టే సాహసం కేసీఆర్ చేస్తారా..? లేదంటే ఎవరినీ పక్కనపెడతారనే అంశం చర్చకు దారితీసింది. దీనిపై మరికొద్దిరోజుల్లో స్పష్టత రానుంది.

15 నెలలే పదవీకాలం...

15 నెలలే పదవీకాలం...

అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవీ మరో 15 నెలల్లో ముగియనుంది. 2022 జనవరితో పదవీకాలం పూర్తవనుంది. దీంతో కవితను ఈ సమయానికే మంత్రివర్గంలోకి తీసుకుంటారా..? ఒకవేళ తీసుకంటే తర్వాత పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతోంది. అలా కాకుండా ఎమ్మెల్సీ అయినందున.. క్యాబినెట్ ర్యాంక్ గల పోస్ట్ ఇస్తారా అనే వాదన వినిపిస్తోంది. కానీ దీనికి కవిత సహా ఇతరులు అంగీకరిస్తారా లేదా అనే ప్రశ్న వస్తోంది. కానీ క్యాబినెట్‌లోకి వచ్చేందుకు కవిత సుముఖంగా ఉన్నారనే చర్చ జరగడం.. ఎమ్మెల్సీ ఎన్నిక కావడం జరిగిపోయింది. దీంతో ఆమె నామినెటేడ్ పదవీ తీసుకొనేందుకు ఇష్టపడరని సన్నిహితుల ద్వారా తెలిసింది.

కేంద్రమంత్రినిత చేద్దామనుకొని..

కేంద్రమంత్రినిత చేద్దామనుకొని..

వాస్తవానికి కవితను కేంద్రమంత్రి చేద్దామని కేసీఆర్ అనుకున్నారు. బీజేపీతో సంప్రదింపులు జరిపినా.. సక్సెస్ కాలేదు. ఈ సారి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించి ఉండొచ్చని క్లోజ్ సర్కిల్స్ చెబుుతున్నాయి. కానీ దీనిపై అదేస్థాయిలో ఉండకపోవచ్చునని కూడా చర్చ జరుగుతోంది. కానీ ఎమ్మెల్యేలు బీగాల గణేశ్ గుప్తా, షకీల్, జీవన్ రెడ్డి మత్రం మంత్రివర్గంలోకి కవిత వస్తారని ఇదివరకే కామెంట్ చేశారు. దీంతో వారి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఏం జరుగుతుందో చూడాలీ మరీ..

ఏం జరుగుతుందో చూడాలీ మరీ..


కవిత ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు.. ఆమె మంత్రి అవుతారా, లేదంటే నామినెటెడ్ పోస్ట్ అప్పగిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై గులాబీ బాస్ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొనున్నారనే టెన్షన్ నెలకొంది. దీనిపై వస్తోన్న ఊహాగానాలకు రాబోయే రోజుల్లో సమాధానం మాత్రం రానుంది. ఏం జరుగుతుందో అప్పటివరకు వేచి చూడాలీ మరీ.

English summary
kavitha will induct cabinet: kalvakuntla kavitha will be induct to telangana cabinet sources said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X