వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ డూడుల్‌గా ‘బతుకమ్మ’: గూగుల్ ఇండియా ఎండీకి కవిత లేఖ

|
Google Oneindia TeluguNews

Recommended Video

గూగుల్ డూడుల్ లో బతుకమ్మ కోసం కవిత గూగుల్ ఎండీకి లేఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం ఈ ఏడాది గూగుల్ డూడుల్ రూపొందించాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత గూగుల్ ఇండియా ఎండీకి ఓ లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే గాక, ప్రపంచ వ్యాప్తంగా 30లక్షల మంది మహిళలు బతుకమ్మ పండగును ప్రతియేటా ఘనంగా నిర్వహించుకుంటారని వివరించారు. ఇలాంటి గొప్ప సాంప్రదాయానికి గూగుల్ డూడుల్‌తో గౌరవించాలని కవిత కోరారు.

Kavitha writes a letter to Google India MD for Bathukamma doodle

బతుకమ్మ పండగ మహిళల స్వేచ్ఛ, ఐక్యతలకు సంకేతమని కవిత వివరించారు. అనేక రకాల పూలతో నిర్వహించుకునే ప్రకృతి పండగ అని ఆమె తెలిపారు. తెలుగు మహిళలు తమ గొప్ప సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఇప్పుడు 15దేశాల్లో బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు.

అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ పండగను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారని కవిత తెలిపారు. మహిళల పండగను తగిన గుర్తింపునిస్తూ గూగుల్ డూడుల్‌గా చూపించాలంటూ గూగుల్ ఇండియా ఎండీని కవిత కోరారు. మీరు గూగుల్ డూడుల్‌గా బతుకమ్మ పండగను ప్రదర్శిస్తారని ఆశిస్తున్నామని, ధన్యవాదాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

English summary
Nizamabad MP Kalvakuntla wrote a letter to Google India MD for Bathukamma doodle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X