వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

KCR 2.0:‌భారీగా పుంజుకున్న బీజేపీ -సంక్షేమాభివృద్ధిలో టాప్, అయినా ఎదురుదెబ్బలు -ఎన్నికల భయం

|
Google Oneindia TeluguNews

బంగారు తెలంగాణ నినాదం, అప్పటికే కొనసాగుతోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాల కొనసాగింపు హామీలతో టీఆర్ఎస్ రెండోసారి గద్దెనెక్కి ఆదివారం(డిసెంబర్ 13) నాటికి సరిగ్గా రెండేళ్లు. దేశంలో మరోసారి మోదీ వేవ్ ఉంటుందని ముందే గుర్తించిన కేసీఆర్ తొలి టర్మ్ ఐదేళ్లు పూర్తికాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, 2014కంటే మెరుగైన సీట్లతో గెలవడం, 2018 డిసెంబర్ 13 కేసీఆర్ రెండో సారి సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. రెండో విడతలోనూ భారీ ఎత్తున సంక్షేమం, కీలకమైన అభివృద్ధి పనులతో ముందుకు వెళుతున్నప్పటికీ, టీఆర్ఎస్ కు అనూహ్యమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేసీఆర్ 2.0లో కాంగ్రెస్ దాదాపుగా ఖతమైపోయి, బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తున్నది..

Recommended Video

Hyderabad : Bandi Sanjay Comments On CM KCR Delhi Tour

కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులు కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులు

తొలి టర్మ్ స్వర్ణయుగం...

తొలి టర్మ్ స్వర్ణయుగం...


ఉద్యమ సారధి, తెలంగాణ సాధకుడనే బిరుదులతో కేసీఆర్ మొదటి సారి సీఎం అయ్యాక టీఆర్ఎస్ హవా మామూలుగా కొనసాగలేదు. రాజకీయ పునరేకీకరణ పేరిట విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను సైతం గులాబీ గూటిలోకి చేర్చుకోగా, మరో మూడు టర్మ్‌ల దాకా రాష్ట్రంలో టీఆర్ఎస్‌దే అధికారం అనే స్థాయిలో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఎక్కడాలేని విధంగా అతి భారీ ఎత్తున సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారు. తొలి టర్మ్ చివర్లో తీసుకొచ్చిన రైతు బంధు టీఆర్ఎస్ కు ఓట్లు కురిపించింది. మిషన్ భగీరథ, ఐటీ రంగంలో అద్భుతమైన ప్రగతి తదితర అంశాలు టీఆర్ఎస్ పాలన పట్ల జనంలో నమ్మకాన్ని పెంచాయి. ఆ ఊపుతోనే రెండోసారి గెలిచినప్పటికీ..

భారత్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ -జనవరి నుంచే షురూ -అక్టోబరు నాటికి సాధారణం: సీరం సీఈవోభారత్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ -జనవరి నుంచే షురూ -అక్టోబరు నాటికి సాధారణం: సీరం సీఈవో

రెండో టర్మ్ సాహసోపేతం..

రెండో టర్మ్ సాహసోపేతం..

కేసీఆర్ 2.0గా పిలుస్తోన్నరెండో టర్మ్ పాలనలోనూ ప్రతి రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి కనిపించింది. కరోనా విలయం కారణంగా ఆదాయం భారీగా తగ్గినప్పటికీ ఒక్క సంక్షేమ పథకానికి కూడా కోత పెట్టకుండా నెట్టుకొచ్చారు. అదే క్రమంలో కొత్త రెవెన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ వంటి సాహసోపేత నిర్ణయాలు 2.0లో తీసుకున్నవే. తెలంగాణకు వరదాయినిగా చెబుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టును సైతం రెండో టర్మ్ తొలి ఏడాదిలోనే పూర్తిచేశారు. కొత్త మున్సిపల్‌ చట్టం చాలా రకాలుగా రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్న ఐటీ.. ఇప్పుడు జిల్లాలకు విస్తరించింది. సంస్కరణలు -సంక్షేమం జోడెడ్లుగా సాగుతున్నప్పటికీ, కేసీఆర్ 2.0 ఆరంభమైన ఆరు నెలలకే ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. అవి సాధారణ పరాజయాలేమీకావు..

సారు..కారు.. 16.. టీఆర్ఎస్ బేజారు..

సారు..కారు.. 16.. టీఆర్ఎస్ బేజారు..

2014లాగే 2019లోనూ మోదీ వేవ్ ఉంటుందని ఊహించిన కేసీఆర్ అసెంబ్లీకి 2018 డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్బుతమైన ఫలితాలు సాధించినా, 2019 మేలో మాత్రం దెబ్బైపోయారు. హైదరాబాద్ మినహా అన్ని లోక్ సభ సీట్లు గెల్చుకుంటామనే ఊపులో ‘సారు.. కారు.. 16'' నినాదాన్ని టీఆర్ఎస్ చచేపట్టగా.. కేసీఆర్ కు ప్రీతిపాత్రురాలైన కూతురు కవిత, కుడి చేయిలాంటి వినోద్ కుమార్ లు ఓడిపోవడంతో తొలి షాక్ తగిలింది. నాటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు దక్కాయి. మిగిలిన 11 చోట్ల టీఆర్ఎస్ గెలిచినా, కేసీఆర్ కుటుంబీకులే ఓడిపోవడంతో తొలిసారి టీఆర్ఎస్ శ్రేణులు ఖంగుతిన్నాయి. అది మొదలుకొని..

ఎన్నికలంటేనే గుబులు..

ఎన్నికలంటేనే గుబులు..

దేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించలేని విధంగా గ్రామాల నుంచి రాష్ట్రా స్థాయిదాకా క్లీన్ మెజార్టీ సాధిస్తూ, ప్రతి ఉప ఎన్నికలోనూ బంపర్ విజయాలు సాధిస్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ 2.0 పాలనలో ఎన్నికలంటేనే గుబులుపుట్టే పరిస్థితి నెలకొంది. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్న రాష్ట్ర బీజేపీకి కేంద్రం నుంచి అండదండలు పుష్కలంగా ఉండటం, కిషన్ రెడ్డికి కేంద్ర పదవి కట్టబెట్టి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందిన తర్వత కమలదళంలో మునుపెన్నడూ లేనంత జోష్ సంతరించుకుంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోని గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గమైన దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తో హోరాహోరీగా తలపడ్డ బీజేపీ స్వల్ప మెర్టీతో సీటుకూడా గెలుచుకుంది. ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైతే టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తూ దాదాపు ఐదు పదుల సీట్లను బీజేపీ ఖాతాలో వేసుకుంది. గ్రేటర్ మేయర్ పీఠం దక్కాలంటే ఎవరో ఒకరి మద్దతు తీసుకోవాల్సిన దుస్థితిలో టీఆర్ఎస్ నిలిచింది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, పలు కార్పొరేషన్ల ఎన్నికలు ముంచుకొస్తుండటం టీఆర్ఎస్ లో ఒకింత ఆలోచన రేకెత్తుతున్నది. బీజేపీ ఇప్పటికే పావులు కదుపుతున్నా టీఆర్ఎస్ ధీమాగా కూర్చుండిపోయింది. రాబోయే..

బీజేపీ ముందు కేసీఆర్ బోల్తా..

బీజేపీ ముందు కేసీఆర్ బోల్తా..


కేసీఆర్ 2.0లో బీజేపీ దూకుడుతో రాబోయే మూడేళ్లలో పొలిటికల్ ఈక్వేషన్లు భారీగా మారబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేతలు కాషాయ కండువాలు కప్పుకొంటుండగా, త్వరలోనే టీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలోకి వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. రెండో సారి సీఎం అయ్యాక తడబడుతోన్న కేసీఆర్.. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రుణమాఫీ, రెండో విడత గొర్రె పంపిణీ, హైదరాబాద్ లో కుల సంఘాలకు భవన నిర్మాణాలు, హైదరాబాద్ లో వరదలు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణలో వైఫల్యం ఇలా చాలా అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా దెబ్బకు ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడ్డా ఈఏడాది రెండో విడత రైతు బంధును కేసీఆర్ విడుదల చేశారు. కానీ పొలిటికల్ గా ఆయన పథకాలు టీఆర్ఎస్ కు మేలు చేయడంలేదని ఇప్పటికే నిరూపణ కావడం శ్రేణుల్ని కలవరపెడుతోంది. తెలంగాణలో మిగతా పార్టీలను సమూలంగా దెబ్బతీసిన కేసీఆర్ రాజకీయ చతుర బీజేపీ ముందు పనిచేయకపోతుండంతో రాబోయే మూడేళ్లు సవాళ్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ లో దెబ్బతిన్న వారం రోజులకే కేసీఆర్ ఢిల్లీలో పర్యటించి కేంద్ర పెద్దలను కలవడంతో గులాబీ-కాషాయ పరస్పర మద్దతు అనే అనూహ్య చర్చ కూడా మొదలైంది..

English summary
As Telangana Chief Minister K Chandrasekhar Rao completes two years of his second term as Chief Minister, KCR 2.0 makes rapid strides in welfare. politically trs faces huge Setbacks from bjp
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X