వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీసుకోండి, కానీ...: కెసిఆర్ అప్పు సూత్రం, వారు శాపగ్రస్తులని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యాంకుల నుంచి అప్పు ఎవరు తీసుకున్నా దాన్ని తిరిగి సకాలంలో చెల్లిస్తేనే మంచిదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. బ్యాంకుల గొప్పతనం గురించి, తీసుకు అప్పులు చెల్లించడంపై అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలో గ్రామీణ వికాస్ బ్యాంకు నూతన శాఖ ప్రారంభం సందర్బంగా ఆయన ప్రసంగించారు.

ఎర్రవల్లి గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, అందరం కలసి మెలిసి పనిచేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయని ఆయన అన్నారు. గ్రామం అభివృద్ధికోసం ఐక్కంగా కృషి చేస్తే అన్నీ ఒక్కొక్కటి అవే వస్తాయని చెప్పారు. ఎర్రవల్లి ఒక్కటే కాదు రాష్ట్రం మొత్తం ఇదే స్ఫూర్తితో పనిచేస్తే తెలంగాణ అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుందని చెప్పారు.

విద్యాసంస్థలపై సమీక్ష

నూతన ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నూతన ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచే తొలి దశ విద్యాసంవత్సరం ప్రారంభం కావాలని ఆయన ఈ సందర్భంగాసూచించారు. పాఠశాలల నిర్మాణాలకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.
వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ,ఎస్టీ ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. నూతన పాఠశాలలన్నీ కేజీ నుంచి పీజీ విద్యలో భాగం కావాలని చెప్పారు.

KCR advises to repay loans in time

వారు శాపగ్రస్తులని కెసిఆర్ వ్యాఖ్య

తన క్యాంపు కార్యాలయంలో కెసిఆర్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో పాటు తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం, ప్రతినిధులు గంగ, ఫర్జానా, స్వర్ణలత కలిశారు. ఆయా కళాశాలల్లో కేటాయింపులు లేకపోయినా తమను బదిలీ చేశారంటూ ముఖ్యమంత్రి దృష్టికి కాంట్రాక్ట్ లెక్చరర్లు తీసుకెళ్లారు. తమకు క్రమబద్దీకరణ అవకాశం కోల్పోయే ప్రమాదం తలెత్తిందని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

క్రమబద్దీకరణ అర్హత ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లను గుర్తించి న్యాయం చేయాలని కెసిఆర్ ఈ సందర్భంగా సూచించారు. గత పాలకుల తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయన్నారు. గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల వివిధ కళాశాలల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న తెలంగాణ లెక్చరర్లు శాపగ్రస్తులయ్యారని అన్నారు.

ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ తదితర పేర్లతో నాటి ప్రభుత్వాలు చేపట్టిన నియామకాలు తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. మానవతా దృక్పథంతో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ అధ్యాపకులకు న్యాయం చేయాలన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao suggested the public to repay bank loans in time at Erravelli in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X