వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్,కేటీఆర్ ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా.?కరోనా గురించి, కనపడకపోడం గురించి అదే చెప్తారా.?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏదైనా రాజకీయ పార్టీలోని సామాన్య కార్యకర్త మీద ఆరోపణలు చెలరేగినా, వదంతులు వ్యాపించినా, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించినా అంతగా ప్రాముఖ్యత ఉండదు. అవే ఆరోపణలు ఓ ముఖ్యమంత్రిపై వస్తే మాత్రం పెద్ద సంచలనంగా మారుతుంటాయి. అందుకు ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు గానీ, లేదా స్వయంగా ముఖ్యమంత్రి గానీ సమాధానం చెప్పి, చెలరేగిన ఉత్కంఠ పరిస్థితులకు తెరదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?సీఎం కేసీఆర్ మిస్సింగ్: స్ట్రాటజీ ఇదేనా.. ఫామ్‌హౌజ్‌లో సీఎంవో సెటప్.. వైరస్ తగ్గేదాకా అక్కడే?

 తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. కేసీఆర్ కనిపించడం లేదంటున్న కాంగ్రెస్..

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. కేసీఆర్ కనిపించడం లేదంటున్న కాంగ్రెస్..

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గత 13రోజులుగా కనిపించడంలదేని ఆరోపించడమే కాకుండా ఆయనలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. ప్రజల్లో లేనిపోని సందేహాలు కలగకముందే చంద్రశేఖర్ రావు ప్రజలకు ముందుకు రావాలని తెలంగాణలోని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో సీఎం ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు నేతలు. కాగా ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా సీఎం చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు కేటీఆర్ మౌనంగా ఉంటూ వస్తున్నారు.

 కేసీఆర్ కేటీఆర్ లది వ్యూహాత్మక నిశ్శబ్దం.. అందరికి సమాధానం చెప్తారంటున్న గులాబీ శ్రేణులు..

కేసీఆర్ కేటీఆర్ లది వ్యూహాత్మక నిశ్శబ్దం.. అందరికి సమాధానం చెప్తారంటున్న గులాబీ శ్రేణులు..

తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కనపడకపోడం, కరోనా లక్షణాలు సోకాయని పుకార్లు వెల్లువెత్తుతున్న సమయంలో స్వయంగా స్పందించకపోయినప్పటికి ఆయన తనకుడు, మంత్రి కేటీఆర్ కూడా ఎందుకు నిశ్వబ్దంగా ఉన్నారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చంద్రశేఖర్ రావు ఫాం హౌస్ లో ఉన్నప్పటికి సిటికీ అందుబాటులో ఉన్న కేటీఆర్ ప్రతిపక్షాల ఆరోపణలకు, ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. ఐతే సీఎం చంద్రరశేఖర్ రావుతో పాటు కేటీఆర్ నిశ్శబ్దం వెనక ఓ బృహత్కర వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.

 13రోజులుగా ఫాం హౌస్ కే పరిమితమైన సీఎం.. పాలన కుంటుపడిందంటున్న ప్రతిపక్షాలు..

13రోజులుగా ఫాం హౌస్ కే పరిమితమైన సీఎం.. పాలన కుంటుపడిందంటున్న ప్రతిపక్షాలు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావుతో పాటు ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వైఖ‌రిపై ఇప్పుడు తెలంగాణ‌లో ప్రతిప‌క్ష పార్టీలు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నాయి. రాష్ట్రంలో సంచలన పరిణామంగా మారిన సచివాల‌యం కూల్చివేత‌, ముఖ్య‌మంత్రి చంద్రశేఖర్ రావు గ‌త కొద్దిరోజులుగా ప్రగతి భవన్ కు, ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల‌కు, మీడియాకు దూరంగా ఉంటున్న వ్యవహారాన్ని తీవ్రస్ధాయిలో తప్పు బడుతున్నాయి. ఇదే అంశంలో సీఎంను విప‌క్షపార్టీలు టార్గెట్ చేస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అంతే కాకుండా వివిధ అంశాల‌పై స్పందిస్తున్న కేటీఆర్ ఈ రెండు ముఖ్య‌మైన అంశాల‌పై మాత్రం మౌనం పాటిస్తుండ‌టం తెలంగాణ ప్రజానికాన్ని ఆశ్యర్యానికి గురిచేస్తున్నాయి.

Recommended Video

#WhereisKcr : KCR Missing..వైరస్ తగ్గేదాకా అక్కడే ! || Oneindia Telugu
 మరో మూడు నాలుగు రోజుల్లో ప్రగతిభవన్ కి కేసీఆర్.. అన్ని అంశాలు చర్చించనున్న సీఎం..

మరో మూడు నాలుగు రోజుల్లో ప్రగతిభవన్ కి కేసీఆర్.. అన్ని అంశాలు చర్చించనున్న సీఎం..

గ‌త రెండురోజులుగా వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో పాటుగా మీడియా స‌మావేశాల్లోనూ పాల్గొంటున్న మంత్రి కేటీఆర్‌, ఈ రెండు అంశాల‌పై మాత్రం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కరోనా విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విఫలం చెందారని ప్ర‌తిప‌క్షాలు రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య అని మాత్రమే కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కానీ త‌న తండ్రి చంద్రశేఖర్ రావు పై వస్తున్న ఆరోపణల గురించి గానీ, కరోనా వైరస్ సోకడంపై కానీ, చంద్రశేఖర్ రావు మౌనం గురించి కానీ కేటీఆర్ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఐతే మరో రెండు మూడు రోజుల్లో సోమవారం లేక మంగళవారం నాడు సీఎం చంద్రశేఖర్ రావు మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో ప్రతిపక్షాల సందేహాలకు సమాధానం చెప్పనున్నట్టు తెలుస్తోంది.

English summary
Opposition parties in Telangana are demanding that CM Chandrasekhar Rao come forward to the people. Leaders are questioning why CM is not responding when Corona is dancing. CM Chandrashekhar Rao and his son KTR are silent despite the criticism of opposition leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X