కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలియక చెప్పా: 'డబుల్' షాక్‌పై కేసీఆర్ క్షమాపణ, అక్కడా అలాగేనని పొన్నం

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్య మానేరు డ్యాం ప్రాజెక్టు నిర్వాసితులను క్షమాపణలు కోరారు. వేములవాడ వచ్చినప్పుడు నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చానని, వారికి ఆర్ అండ్ ఆర్‌ ప్యాకేజీలో ఇళ్లు మంజూరు చేసినందున డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేసే పరిస్థితి లేదని చెప్పారు.

తెలియక హామీ ఇచ్చా.. కేసీఆర్ క్షమాపణ

తెలియక హామీ ఇచ్చా.. కేసీఆర్ క్షమాపణ

ఇందుకు తనను క్షమించాలని కేసీఆర్‌ నిర్వాసితులను కోరారు. ప్రస్తుతం కొత్తగా భూసేకరణ చేస్తున్న చోటనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్‌ కింద ఇళ్లు మంజూరు చేశామని, కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ఆడిట్‌లో సమస్యలు వస్తుండడంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వలేమన్నారు.

పెద్ద మనసుతో క్షమించాలి

పెద్ద మనసుతో క్షమించాలి

ఆ రోజు అవగాహన లేకపోవడం వల్లే హామీ ఇచ్చానని, ఈ విషయమై పెద్ద మనసుతో నన్ను క్షమించాలన్నారు. పరిహారాన్ని యుద్ధప్రాతిపదికన చెల్లిస్తామని కేసీఆర్ చెప్పారు. డబ్బులు కూడా విడుదల చేస్తామన్నారు. నిర్వాసితులను ఆదుకునేందుకు పూర్తి చర్యలు తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

పొన్నం ప్రభాకర్ కౌంటర్

పొన్నం ప్రభాకర్ కౌంటర్

కేసీఆర్‌ పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మిడ్ మానేరు నిర్వాసితులకు గతంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పుడు మాటమార్చారన్నారు. నిర్వాసితులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటన్నారు. గండిపడిన ప్రదేశంలోనే చర్చ పెడతామన్నారు. మిడ్ మానేరు కాలువల పనులు ముందుకు సాగడం లేదని, తెలంగాణకు జీవనాడి మిడ్ మానేరుపై ఇంత నిర్లక్ష్యం తగదన్నారు.

ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలి

ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలి

మిడ్ మానేరు పనులకు సంబంధించి వారు ఏం చేశారో తాము ఏం చేశామో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కరివెన ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, ఏడాది తర్వాత వాళ్లకు కూడా క్షమాపణ చెబుతారేమోనని ఎద్దేవా చేశారు.

మిషన్ కాకతీయలో అవినీతి

మిషన్ కాకతీయలో అవినీతి

తెరాస ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయలో భారీగా అవినీతి జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్‌లో మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టిన ఊర చెరువుకు గండి పడిందిని, ప్రభుత్వ పనుల్లో కూడా ఎన్నో గండ్లు పడ్డాయన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar rao apology to mid manair area people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X