హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇలా చేద్దాం డాడీ: పురపాలన ప్రణాళికపై సీఎం కేసీఆర్‌తో కేటీఆర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలోని ప్రగతి రిసార్ట్స్‌లో కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కార్పోరేటర్ల శిక్షణ తరగతులు ముగిశాయి. మొదటి రెండు రోజులు కార్పోరేటర్లకు శిక్షణ ఇవ్వగా, చివరిరోజు రాష్ట్రంలోని మిగిలిన ఐదు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు.

ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ పాలన, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం, మున్సిపల్ వ్యవహారాల్లో వస్తున్న మార్పులు, కొత్త విధానాలు తదితర అంశాలపై కార్పొరేటర్లలో అవగాహన కల్పించారు.

చివరిరోజు హైదరాబాద్‌తోపాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం తదితర కార్పొరేషన్లకు చెందిన మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు మొత్తం 300మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలు చెబుతున్న అంశాలను వినడమే కాకుండా వారు సైతం కొన్ని సూచనలు, సలహాలిచ్చారు.

విధానాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని, సంఘటితంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఆస్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తరగతులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖామంత్రి పద్మారావు, వాణిజ్య పన్నుల శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు.

 మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో...

మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో...

తరగతుల సందర్భంగా జీహెచ్‌ఎంసీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అంశాలను మంత్రి కేటీఆర్ కార్పొరేటర్లకు వివరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వక్తలు, ఆయా రంగాలకు చెందిన నిపుణులు చెప్పిన విషయాలను కార్పొరేటర్లు ఆసక్తిగా విన్నారు. పలువురు కార్పొరేటర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి అంశాన్నీ లోతుగా చర్చిస్తూ నగరానికి అనువుగా ఉండేలా విధానాల రూపకల్పనకు కృషి చేయాలని నిర్ణయించారు. కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.

 సేఫ్ అండ్ స్మార్ట్ కాలనీ కాన్సెప్ట్

సేఫ్ అండ్ స్మార్ట్ కాలనీ కాన్సెప్ట్


సేఫ్ అండ్ స్మార్ట్ కాలనీ కాన్సెప్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ తరహాలో నగరాన్ని 400భాగాలుగా, లేక 1000భాగాలుగా విభజించి, ప్రతి భాగాన్ని ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తయారు చేస్తారు. కార్డన్(రక్షణ వలయం) తరహాలో సదరు ఏరియాల్లో రోడ్లు బ్లాక్ చేయడం వల్ల నేరాలు తగ్గే అవకాశం ఉంది.

సంఘటిత శక్తిగా ఎదగాలి

సంఘటిత శక్తిగా ఎదగాలి


పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం పెంచాలి. సంఘటిత శక్తితో ఏదైనా సాధ్యం. వార్డు కమిటీలు, ఏరియా సభలను పార్టీలకు అతీతంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, ఏ పార్టీతో సంబంధంలేని న్యూట్రల్ వ్యక్తులు తదితరులతో భర్తీ చేయాలి. మే నెల చివరికల్లా వార్డుకమిటీల ఏర్పాటు పూర్తిచేయాలి.

సంఘటిత శక్తిగా ఎదగాలి

సంఘటిత శక్తిగా ఎదగాలి


పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం పెంచాలి. సంఘటిత శక్తితో ఏదైనా సాధ్యం. వార్డు కమిటీలు, ఏరియా సభలను పార్టీలకు అతీతంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు, ఏ పార్టీతో సంబంధంలేని న్యూట్రల్ వ్యక్తులు తదితరులతో భర్తీ చేయాలి. మే నెల చివరికల్లా వార్డుకమిటీల ఏర్పాటు పూర్తిచేయాలి.

 ప్రతి శనివారం బస్తీ దర్శన్

ప్రతి శనివారం బస్తీ దర్శన్

ప్రతి శనివారం బస్తీ దర్శన్, లేక మరేదైనా పేరుతో కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలి. స్వచ్ఛ హైదరాబాద్ మాదిరిగా ఒక్క పారిశుధ్య పనులకే ప్రాధాన్యతనివ్వకుండా స్థానికంగా విద్యుత్ తీగలు, రోడ్లు తదితర ఏ సమస్య తీవ్రంగా ఉంటే దాన్ని చేపట్టి పరిష్కరించాలి.

ప్రతి ఆదివారం అపార్ట్‌మెంట్ దర్శన్

ప్రతి ఆదివారం అపార్ట్‌మెంట్ దర్శన్


అపార్ట్‌మెంట్ దర్శన్ పేరుతో ప్రతి ఆదివారం స్థానికంగా ఏదో ఒక ప్రాంతంలో తిరిగి స్థానికులతో ముఖాముఖి ఏర్పాటు చేసుకుంటే సమస్యలు తెలిసే అవకాశం ఉంటుంది. వరంగల్ ఎమ్మెల్యే ఇప్పటికే అపార్ట్‌మెంట్ దర్శన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో మంచి పేరు సంపాదించే వీలు కలుగుతుంది.

15రోజులకోసారి టౌన్‌హాలు మీటింగులు

15రోజులకోసారి టౌన్‌హాలు మీటింగులు


ప్రతి పదిహేను రోజులకోసారి టౌన్‌హాలు మీటింగులు ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులంతా సమావేశమై స్థానిక సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. త్వరలో హైదర్‌నగర్ నుంచే మొదటి టౌన్‌హాలు మీటింగులు ప్రారంభంకావాలి.

 డివిజన్ల సమాచారంతో ల్యాప్‌టాప్‌లు

డివిజన్ల సమాచారంతో ల్యాప్‌టాప్‌లు


డివిజన్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం కార్పొరేటర్ వద్ద తప్పనిసరిగా ఉండాలి. సమాచారంతో కూడిన ల్యాప్‌టాప్‌లు, లేక ట్యాబ్లెట్‌లు అందరు కార్పొరేటర్లకు ఇవ్వాలని నిర్ణయం. జీహెచ్‌ఎంసీ ఇవ్వనిపక్షంలో ప్రభుత్వం ద్వారా అందించాలి.

మూడు నెలల్లో ఇంటి నెంబర్లు

మూడు నెలల్లో ఇంటి నెంబర్లు


వీధి, బైలేన్, సబ్‌లేన్ తదితర వాటితో సాధ్యమైనంత తొందరలో, వీలైతే వచ్చే మూడు నెలల్లోనే సులభతరమైన ఇంటి నెంబర్లను రూపొందించడం. ఈ మేరకు వచ్చే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయాలి. దీనికి ఆస్కీ సహకారం తీసుకోవాలి.

 108తరహాలో గుంతలకు టోల్‌ఫ్రీ

108తరహాలో గుంతలకు టోల్‌ఫ్రీ


108తరహాలోనే రోడ్లపై గుంతలకు సైతం ఒక టోల్‌ఫ్రీని రూపొందించి అందుబాటులోకి తేవడం. అంతేకాదు పాట్‌హోల్ డాక్టర్ పేరుతో కనీసం ఐదు వాహనాలను సిద్ధంచేసి ఎక్కడ గుంతలు పడినట్లు సమాచారం అందితే అక్కడికి వెంటనే వెళ్లి గుంతలను పూడ్చివేయడం. వర్షాకాలం వచ్చేలోగా, జూన్, జూలై మాసాల్లోకల్లా ఈ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తేవాలి.

 డబుల్ బెడ్‌రూమ్‌పై స్పష్టత

డబుల్ బెడ్‌రూమ్‌పై స్పష్టత


లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో గుజరాత్ తరహా టీడీఆర్(ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) పద్ధతితోపాటు ఇతర విధానాలపై అధ్యయనం నిర్వహించి మనకు అనుకూలంగా ఉండే విధానాలపై స్పష్టత తేవాల్సి ఉంటుంది.

3నెలలకు ఒకసారి రీఫ్రెష్ కోర్సు

3నెలలకు ఒకసారి రీఫ్రెష్ కోర్సు


ప్రతి మూడు నెలలకోసారి రాజ్‌భవన్ రోడ్డులోని ఆస్కీ కార్యాలయంలో రీఫ్రెష్ కోర్సు తరహాలో రోజంతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది నిరంతరం కొనసాగించాలి. అధికారులు, కార్పొరేటర్లకు మధ్య దూరం పెరగకుండా ఉండాలి.

 సర్కిళ్ల స్థాయి సంయుక్త వర్కింగ్ గ్రూపులు

సర్కిళ్ల స్థాయి సంయుక్త వర్కింగ్ గ్రూపులు

వివిధ శాఖల మధ్య ఉన్నతస్థాయిలో నిర్వహిస్తున్న కన్వర్జెన్స్ మీటింగుల తరహాలో సర్కిళ్ల స్థాయిలో కూడా జాయింట్ వర్కింగ్ గ్రూపులు ఏర్పాటుచేసి సమావేశాలు నిర్వహించాలి.
సర్కిళ్లు 30కి పెంపు : పరిపాలనా సౌలభ్యం కోసం సాధ్యమైనంత తొందర్లో సర్కిళ్ల సంఖ్యను 30కి పెంచడం. ఇప్పటికే ప్రక్రియ మొదలైంది.

English summary
KCR at the closing ceremony of GHMC Corporators training workshop held at Pragati Resorts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X