వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ పుట్టిన రోజు..! కేటీఆర్ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తున్న త‌ల‌సాని..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దిన వేడుక‌లు నేత‌ల మ‌ద్య చిచ్చు ర‌గిలిస్తోంది. చంద్ర‌శేఖ‌ర్ రావు పుట్టిన రోజు వేడుక‌ల‌ను అత్యంత నిరాడంబ‌రంగా నిర్వ‌హించాల‌ని, ఎలాంటి హంగు ఆర్భాటాల‌కు అవ‌కాశం ఇవ్వొద్ద‌ని, కేసీఆర్ పుట్టిన రోజున ఓ మొక్క‌ను నాటి అభినానాన్ని చాటుకోవాల‌ని మాజీ మంత్రి, గులాబీ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాని కేటీఆర్ ఆదేశాల‌కు పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్. కేటీఆర్ అంత సీరియ‌స్ గా చెప్పినా త‌ల‌సాని అంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వెన‌క ఏదైనా అండ‌ర్ స్టాండింగ్ ఉందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

వివాదం అవుతున్న బాస్ పుట్టిన రోజు..! కేటీఆర్ ఆదేశాలు ప‌ట్టించుకోని త‌ల‌సాని..!

వివాదం అవుతున్న బాస్ పుట్టిన రోజు..! కేటీఆర్ ఆదేశాలు ప‌ట్టించుకోని త‌ల‌సాని..!

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఆ పార్టీ యువ‌నేత కేటీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సాదాసీదా రాజ‌కీయాల‌కు భిన్నంగా ఉండే ఈ యువ‌నేత అదే త‌ర‌హాలో మ‌రో కీల‌క నిర్ణ‌యంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఈ నిర్ణ‌యం త‌న తండ్రి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కేంద్రంగా తీసుకున్న‌ది. అయితే, ఈ నిర్ణ‌యం పార్టీకి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత త‌ల‌సానికి కౌంట‌ర్‌లా ఉంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 కేసీఆర్ పుట్టిన రోజున హ‌డావిడి వ‌ద్ద‌న్న కేటీఆర్..! న‌గ‌రాన్ని ఫ్లెక్సీల‌తో నింపిన‌ త‌ల‌సాని..!!

కేసీఆర్ పుట్టిన రోజున హ‌డావిడి వ‌ద్ద‌న్న కేటీఆర్..! న‌గ‌రాన్ని ఫ్లెక్సీల‌తో నింపిన‌ త‌ల‌సాని..!!

ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. పార్టీ ర‌థ‌సారథి కం సీఎం పుట్టిన‌రోజు అంటే స‌హ‌జంగానే ఆ రోజున బ్యానర్లు, ప్రకటనలు వంటి ప్రచారం హోరెత్తుతుంది. అయితే, ఇలా పార్టీ శ్రేణులు స‌న్న‌ద్ధం అవుతున్న త‌రుణంలోనే, కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. సీయం చంద్ర‌శేఖ‌ర్ రావు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌పై డబ్బులు వృధా చేయకుండా, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని కేటీఆర్ అన్నారు. మొక్కలు నాటి సీఎంపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుదాం అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

టీఆర్ఎస్ లో ఎవ‌రి దారి వాళ్ల‌దే..! నేత‌ల మ‌ద్య స‌మ‌న్వ‌య కొర‌త‌..!!

టీఆర్ఎస్ లో ఎవ‌రి దారి వాళ్ల‌దే..! నేత‌ల మ‌ద్య స‌మ‌న్వ‌య కొర‌త‌..!!

కాగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం కేసీఆర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు ఓ రేంజ్‌లో సిద్ధ‌మ‌య్యారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేర‌కు వాటిని పర్యవేక్షించారు కూడా. జలవిహార్లో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లను ఘ‌నంగా చేస్తున్నామ‌ని, హోమాలు, యజ్ఞాలు, కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ పెడుతున్నామ‌న్నారు. దీంతో పాటుగా న‌గ‌ర‌వ్యాప్తంగా పుట్టిన‌రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సెల‌విచ్చారు.

పుట్టిన రోజు వేడుక‌లు ర‌ద్దు..! పుల్వామా ఘ‌ట‌న‌కు నిర‌శ‌న‌గా కేసీఆర్ నిర్ణ‌యం..!!

పుట్టిన రోజు వేడుక‌లు ర‌ద్దు..! పుల్వామా ఘ‌ట‌న‌కు నిర‌శ‌న‌గా కేసీఆర్ నిర్ణ‌యం..!!

ఐతే కేటీఆర్ ఆజ్ఞ‌న‌ల‌ను భేఖాత‌రు చేసారు త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్. కేటీఆర్ నాట‌మ‌న్న మొక్క‌ల సంగ‌తి దేవుడెరుగు., న‌గ‌రం మొత్తం చంద్ర‌శేఖ‌ర్ రావు ఫ్లెక్సీల‌తో నింపేసారు త‌ల‌సాని. కేసీఆర్ జ‌న్మ‌దినాన్ని ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా చాలా నిరాడంబ‌రంగా నిర్వ‌మించుకుందాం అని పిలుపునిచ్చిన కేటీఆర్ మాట‌ల‌ను త‌ల‌సాని అంత ఖాత‌రు చేసిన‌ట్టు క‌నిపించ‌లేదు. ఐతే ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యులుగా మేం వ‌ద్ద‌ని చెప్పుకు వెళ్తాం, కేసీఆర్ అనుచ‌రులుగా మీరు చేసేది చేయండి అనే ఒప్పందం ప్ర‌కారం గులాబీ శ్రేణులు న‌డుచుకుంటున్నారా అనే సందేహం కూడా క‌లుగుతోంది. లేక‌పోతే స్వయానా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆరే చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దిన వేడుక‌ల గురించి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసినా వాటికి విరుద్దంగా త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ న‌డుచుకుంటున్న‌రాంటే అంత‌ర్గ‌త ఒప్పందం ఏదైనా ఉండి ఉండాలి లేదా కేటీఆర్ ఆజ్ఞ‌న‌ల‌ను త‌ల‌సాని లెక్క‌చేయ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డ‌మైనా జ‌రుతుండాల‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడి కార‌ణంగా త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు చంద్ర‌శేఖ‌ర్ రావు స్వయంగా ప్ర‌క‌టించారు.

English summary
Former minister and gulabi party working president KTR called on Chandrasekhar Rao to celebrate the birthday celebrations in the most modest manner. However, former minister Tharasani Srinivasa Yadav is acting differently to KTR orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X