వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక సీఎంకి కేసీఆర్‌ ఫోన్‌..! నీటి విడుదలకు స్వామి ఓకే..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు త్రాగునీటిపై ద్రుష్టి సారించారు. ఇదే అంశంపై ఎండిపోయిన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాల్సిందిగ కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని కోరారు. ఇదే విషయమై ఆయన ఈరోజు ఉదయం స్వామిని ఫోన్ లో సంప్రదించారు. ఇరు ముఖ్యమంత్రులు రాష్ట్ర రాజకీయాల గురించి కాసేపు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం త్రాగునీటి అవసరం ద్రుష్ట్యా చంద్రశేఖర్ రావు చేసిన విజ్నప్తికి కుమార స్వామి సానుకూలంగా స్పందించి నేటి సాయంత్రానికి సుమారు 2.5టీఎంసీల నీటిని విడుదల చేయడాదనికి అంగీకరించినట్టు తెలుస్తోంది.

 ఎండాకాలం షురూ..! మొదలైన నీటి ఎద్దడి..!!

ఎండాకాలం షురూ..! మొదలైన నీటి ఎద్దడి..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం కర్ణాటక సీఎం కుమారస‍్వామితో ఫోన్‌లో మాట్లాడారు. జూరాలకు నీటి విడుదలపై ఆయన ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చించారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని చంద్రశేఖర్ రావు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి నీటి విడుదలకు అంగీకరించారు.

 ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా ప్రభుత్వం..! కర్ణాటక సీఎం కి, కేసీఆర్ ఫోన్..!!

ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా ప్రభుత్వం..! కర్ణాటక సీఎం కి, కేసీఆర్ ఫోన్..!!

కేసీఆర్ కు ఫోన్ చేసిన కుమారస్వామి, తాము 2.5 టీఎంసీలను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తామని చెప్పారు. దీంతో కేసీఆర్ కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి ఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ లోని జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీరు విడుదల కానుంది. 1996లో నిర్మించిన జూరాల ప్రాజెక్టుతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 9.68 టీఎంసీలుగా ఉంది.

 నీటి విడుదలకు ఓకే చెప్పిన కుమార స్వామి..! నేటి సాయంత్రమే నీటి గలగలలు..!!

నీటి విడుదలకు ఓకే చెప్పిన కుమార స్వామి..! నేటి సాయంత్రమే నీటి గలగలలు..!!

తాగునీటి ఎద్దడి దృష్ట్యా జూరాల ప్రాజెక్టుకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి.. కర్ణాటక సీఎస్ టీఎం విజయ్ భాస్కర్‌కు లేఖ రాశారు. తాగునీటి అవసరాలకు నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని ఎస్‌కే జోషి విజ్ఞప్తి చేశారు.

 ఇరు రాష్ట్రాల సీయస్ ల జోక్యం..! నీటి కష్టాలు తీరినట్టే..!!

ఇరు రాష్ట్రాల సీయస్ ల జోక్యం..! నీటి కష్టాలు తీరినట్టే..!!

ఈ నీటి విడుదల విషయానికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక సీఎం కుమారస్వామితో సీఎం చంద్రశేఖర్ రావుతో ఫోన్‌లో మాట్లాడినట్లు సీఎస్ తెలిపారు. సీఎం చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి పట్ల కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. వీలైనంత త్వరగా నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని కుమారస్వామి చెప్పినట్లు ఎస్‌కే జోషి పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్న ఆవాస గ్రామాలకు నీటి ఎద్దడి ఉన్నందున వీలైనంత త్వరగా నారాయణ్‌పూర్ నుంచి నీరు విడుదల చేయాలని కర్ణాటక సీఎస్‌ను జోషి కోరారు.

English summary
Telangana cm kcr spoke with Karnataka Chief Minister kumara swamy on the phone on Friday. He discussed this with the Chief Minister of Karnataka on the release of water to the jurala. Chandrasekhar Rao urged the release of three tmc water for the Jurala Project. Kumaraswamy, who responded positively to this, accepted to release of water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X